జగన్ పై 100 కోట్లకు పరువు నష్టం దావా

0
134

తిరుమల పవిత్రతను దెబ్బతీసినందుకు భక్తులకు, చంద్రబాబుకి జగన్ క్షమాపణ చెప్పాలని టీడీపీ నేత, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్ పై రు. రూ.100 కోట్లకు పరువునష్టం దావా వేస్తామని ఆయన హెచ్చరించారు. 4 నెలల పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీటీడీ బోర్డు సభ్యులుగా క్రిమినల్స్‌ను పెట్టారని అచ్చెన్నాయుడు తీవ్ర ఆరోపణలు చేశారు. సీబీఐ కేసులు, నేరచరిత్ర కలిగిన ముద్దాయిలను టీటీడీ బోర్టు సభ్యులుగా నియమించారని విమర్శించారు.

తిరుమల పవిత్రతను ప్రభుత్వం కాలరాస్తోందన్నారు. శేఖర్‌రెడ్డి దగ్గర లోకేష్ వంద కోట్లు తీసుకుని బోర్డు మెంబర్‌గా నియమించారని విజయసాయిరెడ్డి గతంలో ఆరోపించారని గుర్తుచేశారు. ఇప్పుడు మీ ప్రభుత్వం ఎన్ని కోట్లు తీసుకుని ఆయనను బోర్డు మెంబర్‌గా నియమించిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పచ్చ డైమండ్ తిరుమలలో లేదని జేఈవో ధర్మారెడ్డి మీడియాకు చెప్పారన్నారు. ఆ డైమండ్‌ గురించి గత ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన వారిపై సుమోటాగా కేసు నమోదు చేయాలని కోరారు.

జగన్‌ను విమర్శించినందుకు అయ్యన్నపాత్రుడుపై కేసు నమోదు చేశారన్నారు. గతంలో జగన్, ఆ పార్టీ నేతలు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారన్నారు. వాటిపై ఎప్పుడు కేసులు కట్టలేదన్నారు. పీపీఏల రద్దు వల్ల గ్రామాల్లో గంటల తరబడి విద్యుత్ కోతలు ప్రారంభమయ్యాయని తెలిపారు. బోటు ప్రమాద బాధితులను జగన్ పరామర్శించకపోవడం దారుణమన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here