ఈ డిప్యూటీ సీఎం ఇక సినీ నటి..!

0
105

డాక్టరు కాబోయి యాక్టర్ కావడం చాన్నాళ్లుగా జరుగుతున్నదే. సినీ నటులు పొలిటికల్ లీడర్లు అయిన ఉదంతాలూ కోకొల్లలు. ఇక పొలిటికల్ లీడర్లు కూడా నటులు అవుతున్న సంఘటనలు ఇటీవల చోటు చేసుకుంటున్నాయి. ఆ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి కూడా నటి అయ్యారు. ప్ర‌కృతి వ్య‌వ‌సాయ ప్రాధాన్య‌త‌ను తెలిపేలా రూపొందుతోన్న చిత్రం `అమృత‌భూమి`. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ విజ‌య‌న‌గ‌రంలోని లోవ‌ముఠా ప్రాంతం గొర‌డ గ్రామంలో జ‌రిగింది.

ఈ చిత్రంలో పుష్ప శ్రీవాణి ఉపాధ్యాయురాలి పాత్ర పోషించారు. గిరిజ‌న సంక్షేమ ఆశ్ర‌మ పాఠ‌శాల ఆవ‌ర‌ణ‌లో డిప్యూటీ సీఎం న‌టించిన స‌న్నివేశాన్ని చిత్రీక‌రించారు. ఆ స‌న్నివేశంలోనే అధికారి పాత్ర‌లో క‌లెక్ట‌ర్ హ‌రి జ‌వ‌హ‌ర్‌లాల్ న‌టించారు. ఈ సంద‌ర్భంగా డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ “ప్ర‌కృతి వ్య‌వ‌సాయాన్ని ప్రోత్స‌హించేలా, దాని ప్రాముఖ్యతను తెలియజేసేలా సినిమాను రూపొందిస్తున్నారు“ అన్నారు. ప్ర‌కృతి వ్య‌వ‌సాయంపై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న పెంచ‌డానికే ఈ చిత్రాన్ని రూపొందిస్తున్న‌ట్లు చిత్ర యూనిట్ స‌భ్యులు పేర్కొన్నారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here