ఏపీ గవర్నర్ సంచలన నిర్ణయం… అధికారుల విస్మయం

0
75

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన వల్ల ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఆయన తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తిరుమలలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలకు వెళ్లాలని ఆయన అనుకున్నారు. రాష్ట్ర ప్రథమ పౌరుడిగా ప్రత్యేక విమానంలో వెళ్లవచ్చు. ఆ మేరకు ఏర్పాట్లు చేస్తామని అధికారులూ చెప్పారు. ప్రత్యేక విమానం అంటే చాలా అద్దె ఉంటుంది.. అవసరం లేదు.. మామూలుగా అందరితో పాటే విమానంలో వెళ్తానని ఆయన చెప్పారు. అయితే విజయవాడ నుంచి తిరుపతికి నేరుగా వెళ్లేందుకు విమాన సర్వీసు లేదని అధికారులు అన్నారు. పర్వాలేదు.. హైదరాబాద్‌ వెళ్లి అక్కడి నుంచి తిరుపతి చేరుకుంటానని వెళ్లారు.

ఈ మేరకు గురువారం ఆయన తిరుమలలో బ్రహ్మోత్సవాలకు హాజరయ్యారు. స్వామివారిని దర్శించుకున్నారు. అయితే లక్షల రూపాయలను వృథాగా ఖర్చు చేయడం మాని.. సాధారణ విమానంలో వెళ్లారు. అంతేకాదు.. తిరుమల కొండపై కూడా ఎక్కువ సేపు ఉండలేదు. తానక్కడ అధిక సమయం గడిపితే సామాన్య భక్తులకు ఇక్కట్లు ఎదురవుతాయని భావించారు. తిరుమలలో గెస్ట్‌హౌ్‌సలో ఉన్నా.. ఆలయ ప్రాంగణంలో ఉన్నా.. టీటీడీ అధికారులంతా తన సౌకర్యాలమీదే దృష్టిపెడతారన్న ఉద్దేశంతో కేవలం గంట పాటే అక్కడున్నారు. దర్శనాంతరం మళ్లీ కిందకు వచ్చి.. తిరుపతి నుంచి హైదరాబాద్‌కు సాధారణ విమానంలో వచ్చారు. అక్కడి నుంచి మరో సాధారణ విమానంలో రాత్రికల్లా విజయవాడ చేరుకున్నారు. ఇది చూసిన అధికారులు గవర్నర్ నిబద్ధతను వేనోళ్ళ కొనియాడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here