సీఎం జగన్ వాస్తవాలు దాచారు… సీబీఐ కౌంటర్

0
75

అక్రమాస్తుల కేసులో సీబీఐ కోర్టుకు ముఖ్యమంత్రి జగన్ తన వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరుతూ పెట్టుకున్న పిటిషన్ పై సీబీఐ తీవ్ర అభ్యంతరం తెలిపింది. జగన్ పెట్టుకున్న పిటిషన్‌పై సీబీఐ కోర్టు విచారణ చేపట్టింది. ఈ పిటిషన్‌పై సీబీఐ తీవ్ర అభ్యంతరం తెలుపుతూ కౌంటర్ దాఖలు చేసింది. జైల్లో ఉన్నప్పుడే జగన్ సాక్షులను ప్రభావితం చేశారని సీబీఐ అధికారులు కోర్టుకు తెలిపారు. సీఎం పదవిలో ఉన్న జగన్.. సాక్షులను ఇప్పుడు మరింత ప్రభావితం చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ఏపీలో రెవెన్యూ లోటు కారణంగా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయిపంపు కోరడం సరికాదని సీబీఐ అభిప్రాయపడింది. ఇది కారణంగా చూపించడం సరికాదని సీబీఐ స్పష్టం చేసింది. వాస్తవాలను దాచిపెట్టి రాష్ట్ర విభజన, గత ప్రభుత్వ పనితీరును చూపెట్టి జగన్ మినహాయింపు కోరుతున్నారని ఇది సరి కాదని సీబీఐ స్పష్టం చేసింది. విజయవాడ నుంచి వారానికోసారి రావడం కష్టమేమీ కాదని సీబీఐ పేర్కొంది. సీబీఐ దాఖలు చేసిన కౌంటర్‌పై కోర్టు శుక్రవారం వాదనలు విననుంది. తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉండగానే జగన్ సాక్షులను ప్రభావితం చెసారని ఇప్పుడు తానే ముఖ్యమంత్రిగా వున్నారు కాబట్టి సాక్షులను ప్రభావితం చేసే ప్రమాదం ఉందని సీబీఐ పేర్కొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here