ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణను ఇంటికి వెళ్లిన కేంద్రమంత్రి…!

0
68

ఏబీఎన్-ఆంధ్రజ్యోతి సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణను కేంద్రమంత్రి ధర్మేంద్రప్రధాన్ కలిశారు. శనివారం రాష్ట్ర నేతలతో కలిసి ధర్మేంద్రప్రధాన్ రాధాకృష్ణ ఇంటికి వెళ్లారు. ఆర్టికల్ 370 రద్దుకు గల కారణాలను ఆర్కేకు కేంద్రమంత్రి వివరించారు. సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులను కేంద్రమంత్రులు కలుస్తున్న విషయం తెలిసిందే

ఈ నేపథ్యంలోనే శనివారం హైదరాబాద్ వచ్చిన కేంద్రమంత్రి ధర్మేంద్రప్రధాన్ స్వయంగా వేమూరి రాధాకృష్ణ ఇంటికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. కేంద్రమంత్రి వెంట బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తదితరులు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here