సచివాలయ ఉద్యోగులకు సీఎం జగన్ డెడ్ లైన్ ఇదే..!

0
57

ముఖ్యమంత్రి జగన్ అన్నట్లుగానే గ్రామ, వార్డు సచివాలయాల్లో దాదాపు లక్షకు పైగా ఉద్యోగాలను చెప్పిన సమయానికి భర్తీ చేసారు. పరీక్షల ఫలితాల తర్వాత కొన్ని విమర్శలు, లీకేజీ వివాదాలు చెలరేగిన వాటిని పట్టించుకోకుండా తాను అనుకున్న పనిని నిర్విఘ్నంగా ముఖ్యమంత్రి పూర్తి చేశారు. ఈ సందర్భంగా కొత్తగా ఉద్యోగాల్లో నియమితులైన వారికి ముఖ్యమంత్రి కొన్ని సూచనలు చేశారు. ఉద్యోగ నియామక చరిత్రలో సరికొత్త రికార్డ్ అని ఏపీ సీఎం జగన్ పేర్కొన్నారు. నాలుగు నెలల్లోనే 4లక్షలు ఉద్యోగాలు ఇచ్చామని ఆయన పేర్కొన్నారు. ఉద్యోగంలా కాకుండా బాధ్యతగా తీసుకుని పని చేయాలన్నారు.

లంచాలు లేని పారదర్శక పాలన అందించాలన్నారు. వాలంటీర్లతో సచివాలయ ఉద్యోగులు అనుసంధానం కావాలని జగన్ సూచించారు. ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు తీసుకురావాలన్నారు. అవినీతి లేని పాలన కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. ఆ బాధ్యతను సచివాలయ ఉద్యోగులపై పెడుతున్నామని జగన్‌ స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో అన్నింటికీ లంచం ఇచ్చే పరిస్థితి ఉందన్నారు. గ్రామాల్లో కనీస సదుపాయాలు కల్పించాలని సూచించారు.

72 గంటల్లో ప్రజల ఫిర్యాదులు పరిష్కరించాలని జగన్‌ పేర్కొన్నారు. సమస్యలు పరిష్కరిస్తామన్న భరోసా ప్రజల్లో కల్పించాలన్నారు. గ్రామ పాలనా వ్యవస్థ వెంటిలేటర్‌పై ఉందన్నారు. స్వచ్ఛమైన పాలన అందించేందుకు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చామన్నారు. రెండు నెలల్లో సచివాలయాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని జగన్ పేర్కొన్నారు. ప్రతి వలంటీర్‌కు స్మార్ట్‌ఫోన్‌ అందజేస్తామని.. సచివాలయ వ్యవస్థలో 34శాఖలకు చెందిన 500కి పైగా సేవలు అందిస్తామన్నారు. కొత్త ఏడాది నుంచి సచివాలయ ఉద్యోగుల కార్యకలాపాలు కొనసాగుతాయని జగన్ చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here