హీరో నాగార్జున పొలంలో మృతదేహం

0
38

హిరో అక్కినేని నాగార్జున వ్యవసాయ భూమిలో బయటపడిన మృతదేహం కలకలం రేపింది. షాద్ నగర్ మండలంలో కేశం పెట్ పరిధిలోని వ్యవసాయ భూమిలో కుళ్లిన పొయిన మృతదేహం బుధవారం బయటపడింది. పాపిరెడ్డి గూడ లో 40 ఎకరాల వ్యవసాయ భూమిని నాగార్జున కొనుగొలు చేశారు. ఈ నెల పదిన వ్యవసాయ కేత్రంలో నాగార్జున సతీమణి అక్కినేని అమల చెట్లు నాటారు. వ్యవసాయ క్షేత్రంలో సేంద్రియ పంటలు పండించేందుకు ఎర్పాట్లు చేస్తున్నారు.

ఇందుకోసం ఈ వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించి సలహాలు ఇచ్చేందుకు వ్యవసాయ నిపుణులను నాగార్జున కుటుంబ సభ్యులు ఇక్కడకు పంపారు. ఈ తరుణంలో పొలంలోని ఒక ప్రాంతంలో వున్న గదిలో కుళ్లిపొయిన మృతిదేహాంను నిపుణులు గుర్తించారు. ఆ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు కుళ్లిపొయిన మృతదేహానికి అక్కడే పొస్టు మార్టమ్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. మృతుడు ఎవరన్న దానిపైన పోలీసులు ఆరా తీస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here