గరికపాటి… చాగంటి… ఆ ఇద్దరూ కలిసి చేసిన సంచలనం

0
69

జనరంజకంగా ప్రవచనాలు చెప్పి ఆకట్టుకోవడంలో వారికి వారే సాటి. వీసమెత్తు ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ అనేమి లేదు. కానీ వారి వారి అభిమానుల్లో మాత్రం ఒక విభజన. ఆ విభజనే ఆ ఇద్దరి మధ్య ఉందని ఒక వదంతి. ఆ వదంతులను పటాపంచలు చేస్తూ ఇద్దరూ ఒకే వేదికపై దర్సనమిచ్చారు. మేమిద్దరం ధర్మపరిరక్షణ కోసం పనిచేస్తాం… మా మధ్య విభేదాలు మాటే లేదని సెలవిచ్చారు. ఇక ఆ ఇద్దరి ప్రవచనాలను ఒజేసారి విన్న జనం తరించిపోయారు. తెలుగు రాష్ట్రాల్లో భక్తజన అభిమానాన్ని పొందిన ప్రవచన కర్తలు చాగంటి కోటేశ్వరరావు, గరికపాటి నరసింహారావు ఒకే వేదికపైకి వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు.

ధర్మ ప్రచారమే ఆధ్యాత్మిక వేత్తల లక్ష్యమని, వారి మధ్య ఎలాంటి విభేదాలు ఉండవని గరికపాటి పేర్కొన్నారు. చాగంటి కోటేశ్వరరావుకు తనకు విభేదాలు ఉన్నాయన్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. శనివారం కాకినాడ వచ్చిన ఆయన.. అయ్యప్పస్వామి ఆలయంలో చాగంటి ప్రవచనం ఉందని తెలుసుకుని అక్కడకు వెళ్లి సామాన్య భక్తుడిలా ప్రవచనాలు విన్నారు. చాగంటి ఆయన్ను సాదరంగా వేదికపైకి ఆహ్వానించారు. శరన్నవరాత్రి ఉత్సవాల విశిష్టతను వారు భక్తులకు వివరించారు. ఒకరి ప్రసంగం వింటేనే పులకరించిపోయే భక్తజనం ఇద్దరి ప్రవచనాలు విని తరించిపోయారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here