కోడెలది హత్యే… ఆత్మహత్య కాదు…!

0
62

మాజీ స్పీకర్, టీడీపీ ముఖ్య నేత కోడెల శివప్రసాద్ ఆత్మహత్యపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ వేధింపులకు పరాకాష్టే డాక్టర్‌ కోడెల ఆత్మహత్య అని వ్యాఖ్యానించారు. ఎస్‌ఎస్‌ఎన్‌ కళాశాలలో డాక్టర్‌ కోడెల విగ్రహాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ 37 ఏళ్ళ రాజకీయాల్లో 12 ఏళ్ళ పాటు కోడెల ముఖ్యమైన మంత్రిత్వ శాఖలకు బాధ్యతలు నిర్వహించారని చెప్పారు. కోడెల, ఆయన కుటుంబ సభ్యులపై మొత్తం 20 కేసులు నమోదు చేశారన్నారు. కోడెల మరణిస్తే ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని చెప్పిన ప్రభుత్వం విగ్రహాలకు ఎందుకు అనుమతి ఇవ్వటం లేదని ప్రశ్నించారు.

కోడెల కుటుంబానికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రూ.43 వేల కోట్లు ప్రజాధనాన్ని దోచుకుని జైలు జీవితం అనుభవించి బయటకు వచ్చిన జగన్‌.. కోడెలపై కేసు పెట్టించిన విషయంలో ఏం సమాధానం చెపుతారన్నారు. కోటప్పకొండ ఆలయం, నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల అభివృద్ధికి కోడెల విశేషంగా కృషి చేశారని చెప్పారు. ప్రభుత్వ అక్రమ కేసులకు భయపడవద్దని, ధైర్యంగా ఉండాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు పిలుపు నిచ్చారు. పల్నాడులో ఐదు వందల కుటుంబాలను గ్రామాల నుంచి బలవంతంగా బయటకు పంపించిన ఘనత వైసీపీదన్నారు.

పోలీసులు వైసీపీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని, వారు చెప్పినట్టల్లా టీడీపీ నాయకులు, కార్యకర్తలపై కేసులు పెడుతున్నారన్నారు. చట్టాన్ని అతిక్రమిస్తే పోలీసులను వదిలి పెట్టేది లేదని హెచ్చరించారు. అవసరమైతే కోర్టుకు వెళ్ళి న్యాయ పోరాటం చేస్తామన్నారు. ప్రాజెక్టుల నిండా నిండుగా నీరు ఉన్నా జగన్‌ ప్రభుత్వం కరెంటు కోతలను అమలు చేస్తుందన్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే చీకటి రోజులు వస్తాయని ముందే చెప్పానని, చివరకు రాష్ట్రంలో చీకటి పరిస్థితులు నెలకొంటున్నాయని తెలిపారు. ఇసుక లేక, ఉపాధి దొరక్క దాదాపు 20 లక్షల మంది కార్మికులు పస్తులు ఉంటున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here