ఆర్టీసీ సిబ్బందికి షాక్… చివరకు జీతాలు కూడా…!

0
118

ఆర్టీసీ కార్మికులు ఆర్టీసీ సిబ్బందిగా వున్నప్పుడు ఏ ఇబ్బంది లేదు. ప్రభుత్వ ఉద్యోగులుగా మారిన తొలి నెలలోనే ఊహించని షాక్ ఎదురైంది. ప్రభుత్వ ఉద్యోగులుగా జీతాలు అందుకోబోతున్నాం అన్న వారి ఆశ మీద సర్కారు నిల్లుజల్లింది. మొత్తం జీతం చెల్లించలేమని యాజమాన్యం చేతులెత్తేసింది. ప్రభు త్వం 3 వారాల క్రితం విడుదల చేసిన మొత్తం ఇప్పటికీ అందలేదని గుట్టుబయట పెట్టింది. ఇలాంటి పరిస్థితి రావ డం సంస్థ చరిత్రలో ఇదే మొదటిసారి. ప్రభుత్వంలో సంస్థ విలీనం జరిగితే జీతాలకు, ఉద్యోగాలకు ఇబ్బంది ఉండబోదనుకున్న సిబ్బందిలో ఆందోళన మొదలైంది. ఆర్టీసీ వద్ద ఉన్న మొత్తం నుంచి 80శాతం జీతాలు చెల్లించాలని ఆర్టీసీ ఫైనాన్స్‌ అడ్వైజర్‌(ఎ్‌ఫఏ), చీఫ్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌(సీఏవో) జిల్లాల ఆర్‌ఎమ్‌లకు మంగళవారం అత్యవసర సమాచారం పంపారు.

ఈ విషయం తెలుసుకున్న కార్మిక సంఘా లు… యాజమాన్యం తీరుపై భగ్గుమన్నా యి. గుర్తింపు కార్మిక సంఘం ఎంప్లాయీస్‌ యూనియన్‌ ప్రతినిధులు.. ఆర్టీసీ ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు. మొత్తం జీతం చెల్లించేందుకు డబ్బుల్లేవని, ప్రభుత్వం రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వగానే మిగతా 20 శాతం ఇచ్చేస్తామని ఉన్నతాధికారులు చెప్పారు. వారి సమాధానంతో విభేదిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 128 బస్‌ డిపోల్లో గాంధీ జయంతి రోజు ధర్నాలకు ఈయూ పిలుపునిచ్చింది. కాగా, ఏపీఎస్‌ ఆర్టీసీ ప్రతిరోజూ సుమారు 12వేల బస్సులు తిప్పుతోంది. ప్రయాణికుల నుంచి వచ్చే కలెక్షన్‌ రోజుకు రూ.13కోట్ల నుంచి రూ.14కోట్ల మధ్యలో ఉంటుంది. అయితే డీజిల్‌ ధరల భారంవల్ల సంస్థ నాలుగేళ్లుగా నష్టాలు చవిచూస్తోంది.

దీంతో సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలని భావించినా కుద రకపోవడంతో సిబ్బంది వరకు విలీనం చేసేందుకు నిర్ణయిం చారు. ఈ ప్రక్రియ జనవరి 2020లోపు పూర్తి చేస్తామని రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు స్పష్టం చేశారు. దీంతో 53వేల మంది ఆర్టీసీ కార్మికులు, సిబ్బందిలో సంతోషం వెల్లివిరిసింది. కనీసం వారం రోజులైనా గడవక ముందే జీతాలు చెల్లించేందుకు డబ్బుల్లేవని యాజమాన్యం చెప్పడంతో ఒక్కసారిగా ఆ సంతోషం ఆవిరైంది. 1972లో నాటి గుర్తింపు కార్మిక సంఘంతో కార్పొరేషన్‌ చేసుకున్న ఒప్పందం ప్రకారం ఇప్పటివరకూ ఒక్క నెల కూడా ఒకటో తేదీ దాటకుండా జీతాలు పూర్తిగా వచ్చాయని కార్మికులు చెబుతున్నా రు. అలాంటిది ప్రభుత్వంలో విలీనం అనగానే జీతాలు కూడా పూర్తిగా ఇవ్వలేమనడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

ఏపీఎ్‌సఆర్టీసీకి నెలకు సిబ్బందికి చెల్లించాల్సిన జీతం మొ త్తం రూ.140కోట్లు(నెట్‌) ఉంటుంది. అయితే సెప్టెంబరులో ఆర్టీసీ విలీనానికి రంగం సిద్ధం అవడంతో ప్రభుత్వం జీతాలు చెల్లిస్తుందని ఆర్టీసీ అధికారులు ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకోలేదు. ఇదే సమయంలో ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించాల్సిన రీయింబర్స్‌మెంట్‌ మొత్తం రూ.1572 కోట్లలో రూ.728 కోట్లు విడుదల చేస్తూ సెప్టెంబరు 9న రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ప్రస్తుతం ఆర్టీసీకి ఇన్‌చార్జి ఎండీగా ఉన్న ఎంటీ కృష్ణబాబు ప్రభుత్వం తరఫున ఉత్తర్వులు జారీ చేయడంతో సిబ్బంది జీతాలకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదని ఆర్టీ సీ ఉన్నతాధికారులు భావించారు. అయితే ప్రభుత్వం నిధులు విడుదల జీవో ఇచ్చినా ఖాతాలోకి మాత్రం రాలేదు. దీంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here