పీఎఫ్ వివరాలు… వడ్డీ లెక్కలూ కావాలా… ఇలా చేయండి

0
70

ఉద్యోగులకు బంగారు నిధి ప్రోవిడెంట్ ఫండ్. తమకు తెలియకుండానే పీఎఫ్ ఖాతాల్లో జమ అయ్యే సొమ్ము అపత్కాలంలో ఎంతో అక్కరకు వస్తుంది. అలాంటి పీఎఫ్ సొమ్ముపై వడ్డీ రేట్లు పెంచుతున్నట్లు ఇటీవల మీడియాలో వార్తలు వస్తున్నాయి. అలా పెరిగిన వడ్డీ వల్ల మనకి ఎంత ప్రయోజనం కలుగుతుందో తెలుసుకోవలని అందరికీ ఉంటుంది. అది తెలుసుకోవడం ఎలా..?

కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ఈపీఎఫ్ ఓ చందాదారుల ఖాతాల్లో త్వరలోనే వడ్డీ సొమ్ము జమకానుంది. గత ఆర్థిక సంవత్సరానికి(2018-19) గాను 6 కోట్లకు పైగా పీఎఫ్‌ చందాదారులకు తమ ఖాతాలోని సొమ్ముపై 8.65 శాతం వార్షిక వడ్డీ లభించనుంది. అకౌంట్లో వడ్డీ సొమ్ము జమైందో లేదో మీరు తెలుసుకోవచ్చు. ఎలాగంటే..

www.epfindia.gov.in సైట్‌లోకి లాగిన్‌ అవండి హోమ్‌ పేజ్‌లో ఎడమవైపు మూలన ఉన్న ‘అవర్‌ సర్వీసెస్‌’ టాబ్‌లో ‘ఫర్‌ ఎంప్లాయిస్‌’ ఆప్షన్‌ను ఎంచుకోండి.

మెంబర్‌ పాస్‌బుక్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేయండి

మీ యూఏఎన్‌ నంబరు, పాస్‌వర్డ్‌తో లాగిన్‌కండి

తద్వారా పీఎఫ్‌ అకౌంట్‌ను యాక్సెస్‌ చేయడంతోపాటు ఖాతాలో అప్పటివరకు ఎంత సొమ్ము జమైందో తెలుసుకోవచ్చు.

ఈ యాప్ ద్వారా ట్రై చేయండి…

ఈపీఎఫ్‌ఓ ఉమంగ్‌ అనే మొబైల్‌ అప్లికేషన్‌ (యాప్‌) ద్వారా ఖాతాలో సొమ్ము వివరాలతోపాటు పలు సేవలందిస్తోంది.

మీ స్మార్ట్‌ఫోన్‌లోని ప్లేస్టోర్‌ లేదా యాప్‌ స్టోర్‌ నుంచి ఉమంగ్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోండి

ఉమంగ్‌ యాప్‌ను ఓపెన్‌ చేసి ఈపీఎ్‌ఫఓను ఎంచుకోండి

‘ఎంప్లాయీ సెంట్రిక్‌ సర్వీసెస్‌’ ఆప్షన్‌పై క్లిక్‌ చేయండి

మీ ఖాతాలో బ్యాలెన్స్‌ చెక్‌ చేసుకునేందుకు ‘వ్యూ పాస్‌బుక్‌’ ఆప్షన్‌ను క్లిక్‌ చేయండి

మీ యూఏఎన్‌ నంబర్‌ను ఎంటర్‌ చేసి ‘గెట్‌ ఓటీపీ’ ఆప్షన్‌పై క్లిక్‌ చేయండి

మీ మొబైల్‌ నంబరుకు ఈపీఎ్‌ఫఓ నుంచి వచ్చిన ఓటీపీని ఎంటర్‌ చేశాక లాగిన్‌ ఆప్షన్‌ను క్లిక్‌ చేయాలి

పీఎఫ్‌ బ్యాలెన్స్‌ చెక్‌ చేసుకోదలిచే కంపెనీ మెంబర్‌ ఐడీని ఎంచుకోవాలి

తద్వారా పాస్‌బుక్‌ను యాక్సెస్‌ చేయడంతోపాటు పీఎఫ్‌ బ్యాలెన్స్‌ను చెక్‌ చేసుకోవచ్చు. అయితే, యూఏఎన్‌ యాక్టివేట్‌ అయి ఉండి, యూఏఎన్‌ మెంబర్‌ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వారు మాత్రమే ఈ సేవలను పొందగలరు.

మిస్డ్‌ కాల్‌ లేదా ఎస్‌ఎంఎస్‌ ఇవ్వండి…

కంప్యూటర్‌ లేదా మొబైల్‌లో ఇంటర్నెట్‌ సదుపాయం లేని వారు మిస్డ్‌ కాల్‌ లేదా ఎస్‌ఎంఎస్‌ ద్వారానూ పీఎఫ్‌ ఖాతాలో బ్యాలెన్స్‌ ఎంతుందో తెలుసుకోవచ్చు. ఈపీఎఫ్ఓ వద్ద రిజిస్ట్రేషన్‌ చేసుకున్న మొబైల్‌ నంబరు నుంచి 01122901406 నంబరుకు మిస్డ్‌ కాల్‌ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈపీఎ్‌ఫఓ మీ మొబైల్‌ నంబరుకు బ్యాలెన్స్‌ వివరాలను ఎస్‌ఎంఎస్‌ రూపంలో పంపడం జరుగుతుంది. ఎస్‌ఎంఎస్‌ సర్వీసు కోసమైతే, మీ రిజిస్టర్డ్‌ మొబైల్‌ నుంచి ఈపీఎ్‌ఫఓ అని టైప్‌ చేసి స్పేస్‌ ఇస్తూ యూఏఎన్‌, ఎల్‌ఏఎన్‌ వివరాలు సైతం పొందుపరిచి 7738299899 నంబరుకు పంపాల్సి ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here