సీఎం జగన్ కాదు మునిసిపల్ కమిషనర్… ఈ నిర్వాకం ఎక్కడంటే..!

0
100

ముఖ్యమంత్రి జగన్ ని మునిసిపల్ కమిషనర్ చేసేసారు కొందరు అత్యుత్సాహపరులు. నిర్లక్ష్యంతో చేసిన ఈ తప్పిదం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాంతో జగన్ అభిమానులు.. వైసిపి మద్దతుదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్వతీపురం పురపాలక శాఖ తప్పిదం జనాలకు నవ్వులాటగా మారింది. వార్డు సచివాలయం ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో పార్వతీపురం మున్సిపల్ కమిషనర్‌ స్థానంలో ముఖ్యమంత్రి జగన్ ఫొటో పెట్టారు.

అంతే కాకుండా ప్రత్యేక అధికారిగా స్ధిక ఎమ్మెల్యే జోగారావు ఫోటోను పెట్టారు. ఈ ఫ్లెక్సీని వార్డు సచివాలయం ముందు ఏర్పాటు చేశారు. దీంతో ఫ్లెక్సీని చూసిన జనాలు నవ్వుకుంటున్నారు. అనంతరం తప్పిదం తెలసుకున్న మున్సిపల్ అధికారులు.. వెంటనే ఫ్లెక్సీని తొలగించారు. అయితే అప్పటికే దీనిని ఫోటో తీసిన కొందరు సోషల్ మీడియాలో పెట్టేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here