కర్నూలు కొండారెడ్డి బురుజూ సాక్షిగా… ప్రిన్స్ మహేష్

0
29

సినిమా అంటేనే అద్భుతాలు సమాహారం. చరిత్రక నేపద్యాలను సజీవంగా చిత్రీకరించడంలో తెలుగు సినిమా ఎప్పుడో ప్రపంచంలోనే నంబర్ వన్ అని నిరూపించుకుంది. తాజాగా అలాంటిదే మరో అద్భుత ఘట్టాన్ని ప్రిన్స్ మహేష్ సినిమా కోసం ఆవిష్కరించారు. సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ కోసం ఇప్పుడు చిత్ర‌యూనిట్ ఓ అద్భుతాన్ని ఆవిష్క‌రించింది. ఆ అద్భుత‌మే కొండారెడ్డి బురుజు. క‌ర్నూలు కొండారెడ్డి బురుజుని `సరిలేరు నీకెవ్వ‌రు` సినిమా కోసం రామోజీ ఫిలిమ్ సిటీలో రీ క్రియేట్ చేశారు.

సోమ‌వారం నుండి ఇక్క‌డ కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించ‌నున్నారు. దీని గురించి నిర్మాత అనీల్ సుంక‌ర ట్వీట్ చేశారు. “16 ఏళ్ల క్రితం కొండారెడ్డి బురుజువెండితెర‌పై ఐకానిక్ లొకేష‌న్ అయ్యింది. ఈసారి దీన్ని మ‌రింత పెద్ద‌దిగా చేశాం. ఆర్ట్ డైరెక్ట‌ర్ ఎ.ఎస్‌.ప్రకాశ్ అద్భుతంగా త‌యారు చేశారు. కొండారెడ్డి బురుజుని రామోజీ ఫిలింసిటీకి తీసుకొచ్చారు“ అన్నారు అనీల్ సుంక‌ర‌. ఈ సెట్ ముందు సూప‌ర్‌స్టార్ మ‌హేష్ నిల‌బ‌డి ఉండే ఫొటోను కూడా షేర్ చేశారీయ‌న. మ‌హేశ్‌, అనీల్ రావిపూడి కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న `సరిలేరు నీకెవ్వ‌రు` సంక్రాంతికి రిలీజ్ అవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here