ఈ సీఎంను ఉరి తీయాలా… లోకేష్ సంచలన ట్విట్

0
40

రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని నడిరోడ్డుపై కాల్చాలి అణా మిమ్మల్ని ఉరి తీయాలా అంతో ముఖ్యమంత్రి జగన్ పై మాజీ మంత్రి లోకేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. “మీ పాలన పిచ్చోడి చేతిలో రాయు మాదిరి ఉంది”… అన్నందుకే టీడీపీ సీనియ ర్‌ నేత, మాజీ మంత్రి అయ్యన్నపై కేసు నమోదు చేయడంపై లోకేశ్‌ విస్మయం వ్యక్తం చేశారు. దీనికే కేసు పెడితే… ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉండి ‘రాష్ట్ర ముఖ్యమంత్రిని నడిరోడ్డు మీద కాల్చి చంపాలి’ అని అన్న మిమ్మల్ని ఏం చేయాలి జగన్‌ గారూ? ఉరి తీయాలా’ అని లోకేశ్‌ ట్వీట్‌ చేశారు.

‘‘పాతిక మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచుతానన్న జగన్‌ గారు కేసుల మాఫీ కోసం నడుం వంచి కాళ్ళు పట్టుకొంటున్నారు. కాని నడిచే ఆస్కారం లేని సామాన్య పౌరుడు ప్రసాద్‌ మాత్రం ఆంధ్రకి ప్రత్యేక హోదా కోసం ఇచ్ఛాపురం నుంచి అనంతపురం వరకూ ట్రై సైకిల్‌ యాత్ర పెట్టుకొన్నారు. ప్రసాద్‌ నిబద్ధతకు, దృఢ సంకల్పానికి జోహార్లు. ఆయన ర్యాలీ చూసి జగన్‌ ప్రభుత్వం సిగ్గు తెచ్చుకొని కేంద్రంతో పోరాడి ప్రత్యేక హోదా తేవాలి. వాల్తేరు డివిజన్‌తో కూడిన రైల్వే జోన్‌ సాధించాలని ఆశిద్దామా?’’ అని లోకేష్ తన ట్వీట్‌ లో పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here