మర్డర్ మిస్టరీ… తెలుగు సినిమాలో మోడీ

0
61

జాతీయ అంతర్జాతీయంగా ప్రధాని మోడీకి ఉన్న ఇమేజి… క్రేజీ వేరు. ప్రపంచ శక్తివంతమైన నేతల్లో మోడీ ఒకరు. అలాంటి మోడీ పేరుతో ఉన్న ఒక పాత్ర కీలక భూమిక పోషించేలా ఒక మర్డర్ మిస్టరీ సిద్ధం అవుతోంది. రాజేంద్రప్రసాద్‌, శివశంకర్‌ మాస్టర్‌, సాషా సింగ్‌, రమేశ్‌, చందు కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘క్లైమాక్స్‌’. భవానీ శంకర్‌ దర్శకత్వంలో కైపాస్‌ ఫిల్మ్‌ ప్రొడక్షన్‌ హౌస్‌ పతాకంపై పి. రాజేశ్వర్‌రెడ్డి, కె. కరుణాకర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది.

‘‘పొలిటికల్‌ సెటైర్‌ నేపథ్యంలో నడిచే మర్డర్‌ మిస్టరీ ఇది. తక్కువ పాత్రలే ఉన్నప్పటికీ… ప్రతి పాత్రా హీరోలా ఉంటుంది. త్వరలో రామోజీ ఫిల్మ్‌ సిటీలో భారీ సెట్‌లో ఒక పాట తీయబోతున్నాం. ఏడు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో పలు పురస్కారాలు అందుకున్న ‘డ్రీమ్‌’ తీసిన భవానీ శంకర్‌, ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు’’ అని పి. రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. ‘‘మా చిత్రంలో రాజేంద్రప్రసాద్‌గారి పేరు మోడీ. ఆ పేరు ఎందుకు పెట్టామనేది సినిమా చూస్తే తెలుస్తుంది. మోడీ పాత్ర కోసం ఆయన స్పెషల్‌గా మేకోవర్‌ అయ్యారు. మరో కీలకమైన పాత్రను స్పెషల్‌ పర్సన్‌ చేస్తున్నారు. చిత్రంలో మూడు పాటలకు ప్రేమ్‌ రక్షిత్‌ కొరియోగ్రఫీ అందిస్తున్నారు’’ అని భవానీ శంకర్‌ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here