మన రాష్ట్రంలో పరుగులెత్తే ప్రయివేటు రైళ్లు ఇవే..!

0
108

ఇక మన రాష్ట్రంలోనూ ప్రయివేటు రైళ్ళు కూత పెట్టనున్నాయి. దేశంలో అత్యంత శక్తివంతమైన ప్రభుత్వ రవాణా రంగంగా ఉన్న రైల్వేలను ప్రయివేటికరించాలని మోడీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇంఫులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఐదు ప్రైవేట్ రైళ్లను నడిపేందుకు రైల్వేబోర్డు పచ్చజెండా ఊపింది.ఇందులో సికింద్రాబాద్, విజయవాడ, తిరుపతిల నుంచి మూడు ప్రైవేట్ రైళ్లు నడిపేందుకు రైల్వేబోర్డు సన్నాహాలు చేస్తోంది.

రైల్వే ప్రయాణికులకు ప్రపంచస్థాయి సేవలు అందించాలనే లక్ష్యంతో దేశంలో వంద ప్రైవేటు రైళ్లను నడిపేందుకు ఢిల్లీలోని రైల్వేబోర్డు ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా సికింద్రాబాద్ నుంచి మూడు రైళ్లు విజయవాడ, తిరుపతి ప్రాంతాలకు ప్రైవేటురైలు సర్వీసులు నడపాలని రైల్వే అధికారులు నిర్ణయించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలను కలుపుతూ అధునాతన సౌకర్యాలతో ప్రైవేటు రైళ్లు నడిపేందుకు ప్రైవేటు ఆపరేటర్లను ఎంపిక చేయనున్నారు. ఆదాయం ఎక్కువగా వచ్చే మార్గాల్లో ఈ ప్రైవేటు రైళ్లను నడిపేందుకు రైల్వేబోర్డు పచ్చజెండా ఊపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here