సైరాకి షాక్… చిరంజీవి ఆఫీసుముందే… పోలీసులు రంగంలోకి దిగి

0
36

చిరంజీవి భారీ సినిమా సైరా పైనా వివాదాలు మొదపయ్యాయి. బ్రిటీష్ వారికి ఎదురు తిరిగిన తొలి స్వాతంత్ర్య స‌మ‌ర యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత‌గాథ‌ను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెర‌కెక్కించారు. చిరంజీవి 151వ చిత్రంగా వస్తున్న `సైరా న‌ర‌సింహారెడ్డి`. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రామ్‌చ‌ర‌ణ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా అక్టోబ‌ర్ 2న విడుద‌ల‌వుతుంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.

సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న నేప‌థ్యంలో ఉయ్యాల‌వాడ కుటుంబ స‌భ్యులు త‌మ‌కు న్యాయం చేయాలంటూ జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. `సైరా నరసింహారెడ్డి` సినిమా తీసే స‌మ‌యంలో సినిమాకు అవ‌స‌ర‌మైన పూర్తి స‌మాచారంతో పాటు షూటింగ్‌కి అనువైన లొకేష‌న్స్‌, న‌ర‌సింహారెడ్డి జీవితం గురించి త‌మ నుండి పూర్తి స‌మాచారం తెలుసుకున్నారని, ఆ స‌మ‌యంలో చిరంజీవి త‌మ‌కు న్యాయం చేస్తామ‌ని హామీ ఇచ్చారన్నారని, కానీ ఇప్పుడు న్యాయం చేయ‌డం లేదదంటూ వారు ఆరోపించారు. ఆందోళన జ‌ర‌గుతుంద‌ని సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కి తరలించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here