ప్రజా చైతన్యంతోనే ప్రమాదాల నివారణ… తాడివలస పిలుపు

0
32

రోడ్డు ప్రమాదాలను నివారించడానికి ప్రతిఒక్కరూ ముందుకు రావాలని చీరాల జిల్లా సాధన సమితి ఛైర్మన్ తాడివలస దేవరాజు కోరారు. . ప్రపంచ రోడ్డు ప్రమాద బాధితుల సంస్మరణ దినోత్సవం సందర్బంగా ఆదివారం బీవిజి , 108 రాష్ట్ర మేనేజర్ సురేష్, 108 రాష్ట్ర ఆపరేషన్ హెడ్ రామ్మోహనరావు ఆదేశాల మేరకు రోటరీ క్లబ్ ఆఫ్ క్షీరపురి చీరాల వారి ఆధ్వర్యంలో చీరాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలో ప్రదర్శన చేసారు. ఈ సందర్భంగా దేవరాజు మాట్లాడుతూ నిర్లక్ష్యం , నిబంధనల పట్ల అవగాహన లేక పోవటం వల్లే ప్రమాదాలు పెరుగుతున్నాయని అన్నారు. ప్రమాదాల్లో ఎక్కువగా గాయపడుతున్నది, మృత్యువాత పడుతున్నది యువకులే నని చెప్పారు.

యాక్షిడెంట్లలో తీవ్రంగా గాయపడి కొంతమంది జీవితకాలం మంచానికే పరిమితం అవుతున్నారని దీనివలన వాళ్ళ కుటుంబం ఆర్ధిక పరిస్తితి చిన్నాభిన్నం అవుతుందని చెప్పారు. కుటుంబ యజమాని రోడ్డు ప్రమాదంలో మృతి చెందితే కుటుంబ సభ్యులు అనాధలుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాలను గుర్తించి రోడ్డుపై వాహనాలు నడిపేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ,నిబంధనలు పాటించాలని సూచించారు. 108 వాహనానికి ట్రాఫిక్ లో దారి ఇస్తూ ప్రాణాలను కాపాడాలని 108 ప్రకాశం జిల్లా మేనేజర్ రాకేష్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా తమ వంతు బాధ్యతను నిర్వహిస్తామని ప్రజలతో సంతకాలు చేయించారు. ఈకార్యక్రమంలో 108 సిబ్బంది భాస్కర్, శ్రీను, సునీత్, కిషోర్, సూపర్వైజర్ విష్ణు తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here