రేపే చిరంజీవి అభిమానులకు పెద్ద పండుగ..!

0
50

ఈ నెల 18 న అంటే బుధవారం జరగాల్సిన మెగాస్టార్ చిరంజీవి సినిమా సైరా ప్రీ రిలీజ్ వేడుక వాయిదా పడింది. కానీ అభిమానులకు బుధవారం అసలుసిసలు మజా అందనుంది. చిరంజీవి హీరోగా.. రామ్ చరణ్ నిర్మాతగా, కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ బ్యానర్‌పై రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రస్తుతం షూటింగ్ అనంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.

ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై భారీగా అంచనాలను నెలకొల్పింది. ఐదు భాషల్లో విడుదల కాబోతోన్న ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి. ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను భారీగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రీ రిలీజ్ వేడుకలోనే చిత్ర ట్రైలర్‌ను విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే అనూహ్యంగా చిత్ర ప్రీ రిలీజ్ వేడుక వాయిదా పడింది.

సెప్టెంబర్ 18న జరగాల్సిన ఈ వేడుకను సెప్టెంబర్ 22కు వాయిదా వేశారు. కానీ ట్రైలర్‌ను మాత్రం సెప్టెంబర్ 18నే విడుదల చేస్తున్నట్లుగా చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. ప్రీ రిలీజ్ వేడుక సెప్టెంబర్ 22న హైదరాబాద్‌లోని ఎల్.బి. స్టేడియంలో భారీగా నిర్వహించనున్నారు. అందుకు తగిన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here