సైరా వాయిదా…! ఇదుగో ఇలా బయటపడింది

0
46

కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ బ్యానర్‌పై మెగాస్టార్ చిరంజీవి కధనాయకునిగా రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రస్తుతం షూటింగ్ అనంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై భారీగా అంచనాలను నెలకొల్పింది. ఐదు భాషల్లో విడుదల కాబోతోన్న ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి.

ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను భారీగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ వేడుకను సెప్టెంబర్ 18న నిర్వహిస్తున్నామని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఈవెంట్ పోస్ట్‌పోన్ అయినట్లుగా సమాచారం. సెప్టెంబర్ 18న కాకుండా సెప్టెంబర్ 22న ఈ వేడుకను నిర్వహించనున్నారట. హైదరాబాద్‌లోని ఎల్.బి. స్టేడియంలో ఈ వేడుక జరుగనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here