సైరా ఎఫెక్ట్… ఆరుగురు ఎస్సైలపై వేటు…!

0
99

చిరంజీవిపై అభిమానం ఆ ఎస్సైలకు కొత్త కష్టాలు తెచ్చిపెట్టింది. తమ అభిమాన హీరో సినిమా తొలి షో చూడాలన్న ఆత్రుత వారి కొలువుకు ఎసరు తెచ్చింది. ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. అన్ని వర్గాల నుంచి ఈ సినిమాపై అభినందనలు హోరెత్తుతున్నాయి. అయితే ఈ చిత్రాన్ని తొలిరోజే చూడాలనుకున్న ఆరుగురు ఎస్సైలు బెన్‌ఫిట్ షోకు వెళ్లడంతో వారిపై ఎస్పీ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.

వీరు విధి నిర్వహణలో ఉండగా సినిమాకు వెళ్లడమే చేసిన తప్పిదం. ఇదే ఎస్పీకి తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. కర్నూలు జిల్లా కోవెలకుంట్లలో సైరా నరసింహారెడ్డి బెన్‌ఫిట్ షోకు ఆరుగురు ఎస్సైలు వెళ్లారు. విధులను పక్కన పెట్టి సినిమా చూసి వచ్చారు. దాంతో ఎస్సైల తీరుపై జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప సీరియస్ అయ్యారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించడంతో వీఆర్‌కు పంపాలని ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. సినిమా చూసి వచ్చేసరికి ఉన్న పోస్టింగ్ ఉడిపోవడంతో ఆ ఎస్సైలు లబోదిబో మంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here