తాసిల్దారు లావణ్య మళ్ళీ జైలుకు…!

0
164

తాసిల్దారు లావణ్య తెలుసు కదా డబ్బు కట్టలతో ఏసీబీకి దొరికిన అధికారి. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో పని చేస్తున్న లావణ్యను ఆమె భర్తను కూడా ఎసిబి అధికారులు ఆ మధ్య అరెస్టు చేసి జైలుకు పంపారు. రంగారెడ్డి జిల్లా కేశంపేట మాజీ తహసీల్దార్‌ అయిన లావణ్యను ఏసీబీ మరోసారి అరెస్టు చేసింది. హైదరాబాద్‌, సూర్యాపేటలోని ఆమె బినామీ ఇళ్లలో అధికారులు సోదాలు చేసి, మొత్తం రూ.1.34 కోట్ల అక్రమాస్తులున్నట్లు గుర్తించారు. మంగళవారం ఆమెను ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. లావణ్యకు కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. అక్రమాస్తుల కేసులో ఆమెను జూలై 11న అరెస్టు చేసిన విషయం తెలిసిందే. రూ.93 లక్షల నగదుతో పాటు 40 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసు విచారణలో ఆమె భర్త, మునిసిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ సూపరింటెండెంట్‌ నూనవత్‌ వెంకటేశ్వర నాయక్‌ పేరు బయటికి వచ్చింది. ఆ సమయంలోనే జీహెచ్‌ఎంసీలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ.2.5 లక్షలను లంచంగా తీసుకున్న వెంకటేశ్వరనాయక్‌ను ఏసీబీ అధికారులు ఆగస్టు 30న అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వారిని సస్పెండ్‌ చేసింది.

ఈ కేసుల్లో వెంకటేశ్వర్‌నాయక్‌ ప్రస్తుతం జ్యుడీషియల్‌ కస్టడీలో ఉండగా.. లావణ్య బెయిల్‌పై బయటికి వచ్చింది. విచారణలో భాగంగా వారి బినామీలైన హయత్‌నగర్‌లోని నాగమణి, సూర్యాపేట జిల్లా కపూరియా తండాలోని హుస్సేన్‌ నాయక్‌ ఇళ్లలో మంగళవారం ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు చేశారు. వెంకటేశ్వర్‌నాయక్‌, లావణ్యకు చెందిన రూ.1.34 కోట్ల అక్రమాస్తులున్నట్లు గుర్తించారు. లావణ్యను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here