మీ అంతు చూస్తా… వైసీపీ నేతలకు విడదల రజని సిరియస్ వార్నింగ్

0
91

ప్రత్యర్థి పార్టీలతో ఎంతైనా పోరాడవచ్చు… కానీ సొంత వాళ్ళతోనే ఇబ్బందులు వస్తే తట్టుకోలేం అంటూ చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజని ఆవేడెక్న వ్యక్తం చేశారు. అయితే ఎవరిని వదలబోనని ఆమె హెచ్చరించారు. పార్టీ నేతల ఆత్మీయ సమావేశంలో ఆమె చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ‘చిలకలూరిపేటకు పట్టిన పీడను వదిలించాలని, పేటకోటపై వాలిన అవినీతి గద్దలను తరిమివేయాలని జగనన్న స్థాపించిన వైసీపీలో చేరి పోటీచేశా.. ఎన్నో దుష్టశక్తులు నా కలలను చిదిమివేయాలని చూశాయి.. నా పోరాటాన్ని ఆపేయాలని పన్నాగాలు పన్నినా.. నిజాయితీవుంటే విజయం సాధిస్తామని మొన్నటి ఎన్నికలు నిరూపించాయి’ అని ఎమ్మెల్యే రజిని అన్నారు.

నాలుగు నెలలక్రితమే గెలుపు రుచిచూసినా ఏరోజూ ఆనందాన్ని మనసారా ఆస్వాదించలేదన్నారు. ప్రతిపక్ష పార్టీతోనూ, మాజీ మంత్రితో ఎందాకైనా పోరాడవచ్చు. వారు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. ప్రస్తుతం పరిస్థితి అలా లేదని, మీకు అన్నీ తెలుసన్నారు. ‘ఆడపిల్లనైన నేను నాలుగువైపుల నుంచి శత్రువులతో యుద్ధంచేయాల్సివస్తోంది. సొంతపార్టీలోని కొందరు నన్ను ఇబ్బందులకు గురిచేస్తున్నారు.

నా అనుకున్నవాళ్ళు సైతం నన్ను అడ్డుకోవాలని, నియంత్రించాలని చూస్తున్నారు’ అని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. అందరి అండదండలు తనకు కావాలని, నిస్వార్థంగా పనిచేస్తానన్నారు. ‘నా వెంటే ఉండి వెన్నుపోటు పొడవాలని చూసేవారి అంతుచూస్తా, ఇది నా నైజం’ అని హెచ్చరించారు. చిలకలూరిపేట నియోజకవర్గాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధిచేసి చూపిస్తానని అన్నారు. నాలుగునెలల కాలంలో కేంద్రీయ విద్యాలయాన్ని తీసుకురావడంతోపాటు పట్టణానికి సంబంధించి తాగునీటిసమస్యను సీఎం దృష్టికితీసుకెళ్ళగా రూ.83 కోట్లు మంజూరు చేశారని వివరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here