సైరా వివాదం… ఉయ్యాలవాడ ఫామిలీ తాజా ట్విస్ట్

0
44

మరో రెండు రోజులలో మెగాస్టార్ చిరంజీవి భారీ సినిమా సైరా నరసింహా రెడ్డి విడుదల కానుంది. ఈ సినిమా కోసం చిరంజీవి అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ దశలో ఆ. సినిమాపై నెలకొన్న వివాదాలన్నీ సమసిపోయినట్లు సమాచారం. అక్టోబ‌ర్ 2న విడుద‌ల‌వుతున్న ఈ సినిమా విష‌యంలో గ‌త కొన్నిరోజులుగా వివాదాలు నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే. ఉయ్యాల‌వాడ వంశీకులు `సైరా న‌రసింహారెడ్డి` చిత్రాన్ని అడ్డుకుంటామ‌ని ఆందోళ‌న‌లు చేస్తున్న సంగ‌తి కూడా తెలిసిందే.

సైరా చిత్రీక‌ర‌ణ స‌మయంలో త‌మ‌కు చిరంజీవి, చ‌ర‌ణ్‌లు ఇచ్చిన హామీ నిల‌బెట్టుకోలేద‌ని వారు ఆరోప‌ణ‌లు చేశారు. ఈ వివాదం అనేక మ‌లుపులు తీసుకుంది. ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి కుటుంబీకుల‌ను ఎవ‌రో ఉసిగొల్పార‌ని, వారు 23 కుటుంబాల వారు ఒక్కొక్క ఫ్యామిలీకి రెండు కోట్లు చొప్పున డిమాండ్ చేశార‌ని చిరంజీవి కూడా రీసెంట్ ఇంట‌ర్వ్యూలో తెలిపారు. అయితే దీనిపై ఉయ్యాల‌వాడ కుటుంబ స‌భ్యులు స్పందించారు.

చిరంజీవి చెప్పిన‌ట్లు తమ వంశీకులు ఒక్కొక్క కుటుంబానికి రెండు కోట్ల రూపాయ‌లు చెల్లించ‌మ‌ని అడ‌గ‌లేద‌ని, ఆయ‌న అబ‌ద్ధం చెబుతున్నార‌ని అన్నారు. అయితే చర‌ణ్ ఇది వ‌ర‌కు చెప్పిన‌ట్లు తాము ఒక్కొక్క కుటుంబానికి రూ.15 ల‌క్ష‌లు అడిగామ‌ని తెలిపారు. సినిమా విడుద‌ల సంద‌ర్భంగా తాము సినిమాకు సంబంధించి వేసిన కేసుల‌న్నీ వెన‌క్కి తీసుకుంటున్న‌ట్లు ఈ సంద‌ర్భంగా వారు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here