టీడీపీలో 80 మంది సీనియ‌ర్ల‌ సీట్లు గ‌ల్లంతేనా!

ఎన్టీఆర్ సినిమా రంగంలో నుంచి రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. 1982 మార్చి 29న పార్టీని స్థాపించారు. తొమ్మిదినెల‌ల‌కే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌ను ఢీకొట్టారు. ఎక్కువ‌ యువ‌కుల‌కు అవ‌కాశం ఇచ్చారు. ఆ యువర‌క్తం కాంగ్రెస్ కోట‌ల‌ను కూల్చేసింది. తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చింది. ఇది జ‌రిగి ఇప్ప‌టికి 35 ఏళ్లు. నాటి యువ నేతలూ ఇప్ప‌టికీ ఆ పార్టీతో ఉన్నారు. శాస‌న‌స‌భ్యులుగా, మంత్రులుగా కొన‌సాగుతున్నారు. యువ‌ర‌క్తం త‌గ్గిపోయింది. అందుకే సీఎం చంద్ర‌బాబు క‌ఠిన నిర్ణ‌యానికి సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు తెలుస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో 80 మంది సీనియ‌ర్ల‌ను ప‌క్క‌న‌పెట్టాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు తెలుస్తోంది. ఆ స్థానాల్లో యువ‌కుల‌కు సీట్లు కేటాయించాల‌నే యోచ‌న‌లో ఉన్నారు. సీనియ‌ర్ నేత‌ల వార‌సుల‌కు అవ‌కాశం క‌ల్పించాల‌ని భావిస్తున్నారు. లేక‌పోతే వాళ్ల వెంట తిరుగుతున్న యువ‌కుల్లో స‌మ‌ర్థుల‌కు సీట్లు కేటాయించాల‌ని అనుకుంటున్నారు. ఇప్ప‌టికే ఆ మేర‌కు క‌స‌ర‌త్తుకూడా ప్రారంభించారు. స‌ర్వేలూ జ‌రుగుతున్నాయి. త‌న త‌ర్వాత కొడుకు లోకేష్‌ను ముఖ్య‌మంత్రి సీటులో కూర్చోబెట్ట‌డ‌మే ల‌క్ష్యంగా చంద్ర‌బాబు కొత్త‌టీమ్‌ను రెడీ చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ని తెలుస్తోంది. లోకేష్ కూడా ఇప్ప‌టికే యువ‌కుల‌టీమ్‌ను రెడీ చేస్తున్నారు. అయితే చంద్ర‌బాబు సీనియ‌ర్ల సేవ‌లను పార్టీని ముందుకు న‌డిపేందుకు ఉప‌యోగించుకోవాల‌ని భావిస్తున్నారు. అయితే వాళ్లు అసంతృప్తి చెంద‌కుండా ఉండేందుకు వార‌సులకు అవ‌కాశం ఇస్తామ‌ని హామీ కూడా ఇస్తున్న‌ట్లు స‌మాచారం. దాంతో ఇప్ప‌టికే వార‌సుల‌ను చ‌ట్ట‌స‌భ‌ల‌కు పంపాల‌ని భావిస్తున్న నేత‌లంతా హ్యాపీ అయిన‌ట్లు తెలుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *