జేఎన్ యూలో ఎబివిపి దాడులు… లెఫ్ట్ నేతలపై దుశ్చర్య

ఓటమిని జీర్ణించుకోలేని ఎబివిపి జేఎన్‌యూలో దాడులకు దిగింది. జేఎన్‌యూ విద్యార్థి సంఘం ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్ది సేపటితే ఎన్నికల్లో గెలిచిన లెఫ్ట్ సంఘాల నేతలపై దాడులు చేసింది. యూనివర్సిటీ క్యాంపస్‌లో జరిగిన ఈ ఘర్షణలో జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన ఎన్.సాయిబాబాపై పలువురు ఏబీవీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. తాజా ఎన్నికల నాటి నుంచి ఇలాంటి సంఘటన జరగడం ఇది రెండోసారి.

గతంలో బ్యాలెట్ బాక్సులను తీసివేసేందుకు ప్రయత్నించడం, బలవంతపు ప్రవేశంపై ఇంతకు ముందు కొంతమందిని సస్పెండ్ చేశారు. ఆ సమయంలో కూడా ఘర్షణ జరిగింది. ఇప్పుడు ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం, అర్థరాత్రి ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఏర్పడింది. దాడి చేసి కొట్టింది కాకుండా లెఫ్ట్ విద్యార్థి సంఘాలకు చెందిన నేతలు తమపై దాడికి పాల్పడ్డాయని ఏబీవీపీ నేతలు ఆరోపించారు.

కానీ ఆర్ఎస్ఎస్-ఏబీవీపీ నేతలు తమపై మూక దాడులకు దిగారని లెఫ్ట్ విద్యార్థి సంఘాలకు చెందిన నేతలు చెబుతున్నారు. క్యాంపస్‌లో ఘర్షణ వాతావరణంపై స్పందించిన డీసీపీ దేవెందర్ ఆర్య ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని తెలిపారు. యూనివర్సిటీలో జరిగిన ఎన్నికల్లో ఐక్య వామపక్ష కూటమి ఘన విజయం సాధించింది. ఆదివారం ప్రకటించిన ఫలితాల్లో సాయిబాలాజీ సహా.. 4 కేంద్ర ప్యానెళ్లను వామపక్ష కూటమి సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *