విడాకులు తీసుకున్నా… అయినా అజార్‌తోనే ఉంటున్నా

మాజీ క్రికెట‌ర్ అజారుద్దీన్‌తో తాను విడాకులు తీసుకున్న‌ట్లు బాలీవుడ్ న‌టి సంగీతా బిజిలానీ తెలిపారు. అయితే, తాను ఆయ‌న‌తో వేరు ప‌డ‌లేద‌ని ట్టిస్ట్ ఇచ్చారు. అజారుద్దీన్ తాను చ‌ట్ట‌ప‌రంగా విడాకులు తీసుకున్న‌ప్ప‌టికీ ఆయ‌న‌కు దూరం కాలేద‌ని, అజార్‌తో స‌న్నిహితంగానే ఉంటున్నాన‌ని సంగీతా చెప్పారు. ఇక‌, అజారుద్దీన్ జీవిత చ‌రిత్ర అంటూ తీసిన సినిమాలో అవాస్త‌వాలే జొప్పించార‌ని సంగీత తెలిపారు.

అజార్ మీద అభిమానంతో ఈ సినిమా చూసిన వారంతా మ్యాచ్ ఫిక్సింగ్ గురించే చ‌ర్చించుకుంటున్నార‌ని ఆనాటి వ్య‌వ‌హారాల‌ను గుర్తు చేసుకుంటున్నార‌ని సంగీత చెప్పారు. అజహర్ తాను కలిసిన మొదటి సమావేశం… ఆ సన్నివేశాన్ని కూడా తప్పుగా చూపించారని సంగీత ఆరోపించారు. అజహర్ సంగతా బిజిలానీని 1996లో పెళ్లాడారు. రెండు దశాబ్ధాల పాటు కొనసాగిన వీరి దాంపత్య ఇటీవల విడాకులతో ముగిసింది. పెళ్లి అనంతరం సినిమాలకు గుడ్ బై చెప్పిన సంగీత త్వరలో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తానని ప్రకటించింది. ‘‘నన్ను చాలామంది నిర్మాతలు సంప్రదిస్తున్నారని…త్వరలో ఆసక్తికరమైన చిత్రాల్లో నటించేందుకు సంతకం చేస్తాను’’ అని సంగీత బిజిలానీ వెల్ల‌డించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *