బాబు నంబర్ 1… ఏపీ నంబర్ 3…!

ఏపీ సీఎం చంద్రబాబు మరో ఘనత సాధించారు. రాష్ట్రాన్ని మరోసారి అగ్రస్థానంలో నిలిపారు. విభజన తర్వాత రోడ్డున పడ్డ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 3గా నిలబెట్టారు. తాను అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో ప్రతి ఏటా పెట్టుబడుల సేకరణ విషయంలో రాష్ట్రాన్ని పురోభివృద్ధి బాటలో పయనింపజేస్తూ ఇప్పుడు ఏకంగా దేశంలో మూడో స్థానంలో నిలిపారు. అలాగే దక్షిణాదిలో ఏపీ ఏ నెంబర్ వన్ గా నిలిచింది. దాంతో ఈ ప్రాంతంలో బాబే నెంబర్ వన్ సీఎం అనిపించుకుంటున్నారు.

దేశవ్యాప్తంగా పెట్టుబడుల సేకరణలో ఏపీ మూడో స్తానం సాధించింది. గుజరాత్… మహారాష్ట్రలు తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. భారతీయ రిజర్వ్ బ్యాంకు విడుదల చేసిన ఈ నివేదికలో మరో తెలుగు రాష్ట్రం తెలంగాణ ఆరో స్థానంలో నిలిచింది. ఈ ఏడాది అత్యధిక ప్రయివేటు పెట్టుబడులు ఆకర్షించిన రాష్ట్రాల జాబితాను ఆర్బీఐ తాజాగా ప్రకటించింది. ఆ నివేదిక ప్రకారం గత ఏడాది కాలంలో రాష్ట్రానికి 48 ప్రాజెక్టులు వచ్చాయి. వీటి ద్వారా పెట్టుబడుల వృద్ధి రేట్ 8.5%నికి ఎగబాకింది. దానితో దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీ అగ్రస్థానంలో నిలిచింది

రాష్ట్రంలో కనీస మౌలిక వసతులు కూడా లేకుండా… రాజధాని కూడా లేని ఏపీ… పెట్టుబడిదారులను ఆకర్షించే విషయంలో తనకు ఎదురు లేదని నిరూపించుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *