ఓ ఏఎస్ఐ విశృంఖ‌లం… మ‌హిళా హోం గార్డుతో

తెలంగాణ‌లోని ఒక ఏఎస్ఐ బ‌రితెగించారు. కిందిస్థాయి ఉద్యోగినితో బాడీ మ‌సాజ్ చేయించుకుంటూ కెమెరాకు చిక్కారు. షీ టీమ్స్ పెట్టి మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణపై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ క‌న‌బ‌రుస్తున్న తెలంగాణ‌లో ఇలా ఒక పోలీసు అధికారే త‌న కిందిస్థాయి మ‌హిళా పోలీసుతో మ‌సాజ్ చేయించుకోవ‌డం క‌ల‌క‌లం రేపింది. త‌న కింద ప‌నిచేసే ఒక మ‌హిళా హొంగార్డు ప‌ట్ల ఆ ఏఎస్ఐ వ్య‌వ‌హ‌రించిన తీరు రాష్ట్రంలో చ‌ర్చ‌నీయాంశం అయ్యింది.

జోగులాంబ జిల్లా కేంద్రం గద్వాలలోని ఆర్మ్‌డ్ రిజ‌ర్వు పోలీసు విభాగానికి చెందిన ఏఎస్‌ఐ ఒకరు ఇలా బాధ్య‌త మ‌రిచి వ్య‌వ‌హ‌రించారు. అదే విభాగంలో పనిచేస్తున్న మహిళా హోంగార్డుతో ఒళ్లు పట్టించుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో సోమవారం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడంతో స్పందించిన జిల్లా ఎస్పీ విజయ్‌కుమార్‌ విచారణకు ఆదేశించారు. విచారణలో భాగంగా అదనపు ఎస్పీ భాస్కర్‌ ఆ వీడియోలను పరిశీలించారు. అందులోని పరిసరాలను బట్టి ఆ బాగోతం కార్యాలయంలోనే జరిగిందని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం.

త‌క్ష‌ణం ఏఎస్ఐ వ్య‌వ‌హారంపై పూర్తిస్తాయి విచార‌ణ‌కు ఆదేశించారు. అస‌లు ఆర్మ్‌డ్ రిజ‌ర్వు విభాగంలో ఏం జరుగుతోందన్న కోణంలో విచారణ చేపట్టారు. అక్కడ పనిచేస్తున్న అధికారులు, సిబ్బందిని వ్యక్తిగతంగా విచారించి పూర్తి వివరాలతో ఎస్పీకి నివేదిక సమర్పించారని తెలిసింది. ఏఎస్ఐ వ్య‌వ‌హారంపై విచార‌ణ చేస్తున్నామ‌ని పూర్త‌యిన త‌ర్వాత అన్ని వివ‌రాలు వెల్ల‌డింస్తామ‌ని ఉన్న‌తాధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *