రేప్ కోసులో ఆశారామ్ దోషి… శిక్ష ఎంత భారీగా అంటే…?

పదహారేళ్ల బాలికపై అత్యాచారం కేసులో ఆశారాం బాపును న్యాయస్థానం దోషిగా నిర్ధారించింది. ఆ కేసులో ఆయనకు జోథ్‌పూర్ కోర్టు జీవిత ఖైదు విధించింది. మరణించే వరకు జైలు శిక్ష అనుభవించాలని తెలిపింది. బుధవారం ఉదయం ఈ కేసును విచారించిన కోర్టు బాలికను అత్యాచారం చేసిన కేసులో ఆశారాం బాబును దోషిగా ప్రకటిస్తూ తీర్పును వెలువరించింది. మరో ఇద్దరు దోషులకు 20 సంవత్సరాల చొప్పున జైలు శిక్ష విధించింది. మధ్యప్రదేశ్‌లోని చింద్వారాలో గల ఆశారాం ఆశ్రమంలో చదువుకుంటున్న బాలికపై ఆగస్టు 15, 2013న అత్యాచారం చేసినట్లు ఆశారాం బాపుపై కేసు నమోదైంది.

ఆశారాంతో పాటు మరో నలుగురిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఈరోజు తీర్పు నేపథ్యంలో రాజస్థాన్, గుజరాత్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో అదనపు భద్రతా బలగాలను మోహరించి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశించింది. అలాగే ఉత్తర్‌ప్రదేశ్‌లోని షాహజాన్‌పుర్‌కు చెందిన అత్యాచార బాధితురాలి ఇంటి వద్ద కూడా సెక్యూరిటీని నియమించారు.
2013లో ఆశారాం బాపు తనపై లైంగిక దాడి చేశారంటూ ఓ యువతి ఫిర్యాదు చేసింది. పదహారేళ్ల అమ్మాయి బోధ్‌పూర్‌లోని ఆశ్రమంలో ఆశారాం తనపై లైంగిక దాడి చేశారంటూ ఫిర్యాదు చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ అమ్మాయికి పట్టిన దెయ్యాన్ని వదిలిస్తానని మభ్య పెట్టిన ఆశారాం అత్యాచారం చేసినట్లు బాధిత బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసు నమోదైనప్పటికీ ఆశారాం బాపు పోలీసుల ఎదుట హాజరుకాలేదు. అందరి కళ్లుగప్పి ఇండోర్‌లోని తన ఆశ్రమంలో దాక్కున్నారు. నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌లు జారీ చేసిననప్పటికీ అతను బయటకు రాలేదు. చివరకు 2013, సెప్టెంబర్ 1న ఆశారాంను రాజస్థాన్ బోధ్‌పూర్ పోలీసులు అరెస్ట్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *