రెడ్డిగారా..? జయసింహా..? టైటిల్ ఏదైనా షూటింగ్ స్టార్ట్

ఈ ఏడాది నందమూరి బాలకృష్ణ మంచి దూకుడు మీదున్నారు. వందో సినిమా గౌతమిపుత్ర ఇచ్చిన ఊపుతో 101 గా పైసా వసూల్ మొదలుపెట్టిన బాలయ్య నిన్నే ఆ సినిమా పూర్తి చేశారు. అలా అది పూర్తి చేసారో లేదో మరునాడే గురువారం 102 వ సినిమా మొదలు పెట్టేసారు. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న సినిమా లాంఛనంగా ప్రారంభమయింది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ డైరెక్టర్ బోయపాటి శ్రీను క్లాప్ కొట్టగా, డైరెక్టర్ కేఎస్ రవి కుమార్ దర్శకత్వం వహించారు. సీ కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నయన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, అశుతోష్ రాణా కీలక పాత్రలో నటిస్తున్నారు.

ఈ సినిమాకు ఓజా భారీ విలన్ ని తీసుకున్నట్లు సమాచారం. అతడు పంజాబీలో టాప్ హీరో అని చెబుతున్నారు. అనుకున్నట్లుగా ఒక్క రోజు కూడా గ్యాప్ లేకుండా మొదలు పెట్టిన ఈ సినిమాకి రెడ్డిగారు అనే టైటిల్ పెడతారంటూ ప్రచారం జరిగింది. ఆ తర్వాత జయసింహ అనే టైటిల్ పెట్టే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. సింహా సెంటిమెంట్ తో రెండో టైటిల్ వైపు మొగ్గు చూపుతున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్.
ఈ నెలాఖరు వరకు రామోజీ ఫిల్మ్ సిటీలో.. తర్వాత కుంభకోణంలో సినిమా చిత్రీకరిస్తామని నిర్మాత సి కళ్యాణ్ చెప్పారు. వైజాగ్, హైదరాబాద్‌లలో షూటింగ్ చేసి వచ్చే సంక్రాంతికి సినిమాను విడుదల చేస్తామని ఆయన తెలిపారు.

శాతకర్ణి అంటూ హిస్టారికల్ లుక్ తో ఆకట్టుకున్న బాలయ్య ఆ తర్వాత పైసా వసూల్ అంటూ క్లాస్ లుక్ కి వచ్చేసారు. ఇక 102వ సినిమాలో మాత్రం మరోసారి ఊరమాస్ లుక్కులో తన పాత బ్రాండ్ ని బయటకు తీస్తున్నారు. ఇప్పటి బాలయ్య లుక్ చూస్తే.. ఒక్కసారిగా మనకు లక్ష్మీ నరసింహా మహారథి వంటి సినిమాల్లో కనిపించి ఊరమాస్ లుక్ గుర్తుకు వస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *