ఇదీ నా ఉద్దేశం…. టీడీపీలో చేరిక‌పై బాలినేని క్లారిటీ

టీడీపీలో 11 మంది ఎమ్మెల్యేలు. వారిలో జ‌గ‌న్ బంధువు బాలినేని శ్రీ‌నివాస‌రెడ్డి…. కుడి భుజంగా చెప్పుకునే గండికోట శ్రీ‌కాంత్ రెడ్డి. నంద్యాల ఎన్నిక‌ల త‌ర్వాత రాష్ట్రంలో షికారు చేస్తున్న రాజకీయ వ‌దంతి. అత్యంత ఆస‌క్తి రేకెత్తిస్తున్న అంశం కూడా ఇదే. అయితే, తాను పార్టీ మారుతున్నాన‌ని, టీడీపీలో చేరుతున్నాన‌ని వ‌స్తున్న వార్త‌ల‌పై బాలినేని శ్రీ‌నివాస‌రెడ్డి క్లారిటీ ఇచ్చారు. త‌న‌పై సోష‌ల్ మీడియాలో జ‌రుగుతున్న ప్ర‌చారంలో వాస్త‌వం ఎంతో స్ప‌ష్టం చేశారు.

ఒంగోలులో వైసీపీ కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో బాలినేని మాట్లాడారు. తాను మంత్రి పదవిని కూడా వదులుకొని వైఎస్‌ జగన్‌ వెంట నడిచానని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తాను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేస్తున్నానని, అందువల్ల కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. త‌న‌పై సోష‌ల్ మీడియాలో అస‌త్య పోస్టింగులు పెట్టే వారిని ఉపేక్షించ‌బోన‌ని తేల్చి చెప్పారు. వారిపై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని కూడా హెచ్చ‌రించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడిచిపోయినా ఇంత వరకు ఏ ఒక్క హామీని కూడా అమలు చేసిన పరిస్థితి లేదన్నారు.

ప్ర‌జ‌ల అవ‌స‌రాల‌ను దృష్టిలో ఉంచుకుని త‌మ పార్టీ అధినేత జ‌గ‌న్ న‌వ‌ర‌త్న ప‌థ‌కాల‌ను ప్ర‌క‌టించార‌ని బాలినేని వివ‌రించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పథకాలు అమ లు చేసి అన్ని కుటుంబాలను ఆదుకుంటామనే భరోసాను కల్పించాలని బాలినేని కార్య‌క‌ర్త‌ల‌కు సూచించారు. తాను పార్టీ మారే ప్ర‌స‌క్తే లేద‌ని బాలినేని మ‌రోసారి పున‌రుద్ఘాటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *