అద్దెకు దిగిన వారి బెడ్‌రూంలో కెమెరా పెట్టి… ఆ దృశ్యాల‌ను..


బెంగ‌ళూరులో ఒక ఇంటియ‌జ‌మాని కుమారుడు దారుణానికి తెగ‌బ‌డ్డాడు. త‌మ ఇంటిలో అద్దెకుండే వారి ప‌రువును అన్‌లైన్‌లో పెట్టాడు. ఆ ఇంటిలోని భార్యా భ‌ర్త‌ల బెడ్‌రూం దృశ్యాల‌ను ర‌హ‌స్య కెమెరాల‌తో చిత్రీక‌రించి వాటిని ఏకంగా వెబ్‌సైట్‌లో పెట్టాడు. విష‌యం ఆ దంప‌తుల దృష్టికి రావ‌డంతో వారు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. బెంగళూరు నగరం కోరమంగలలో అద్దె ఇంట్లో నివసించే ఆ దంపతులు తమ బెడ్‌రూం దృశ్యాలు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ అయిన విషయం మిత్రుల ద్వారా తెలుసుకుని దిగ్ర్భాంతికి గురయ్యారు.

ఆ వెంట‌నే ఆ భార్యా భ‌ర్త‌లు సైబర్‌క్రైం పోలీసుల‌న ఆశ్ర‌యించారు. త‌మ ఇంటి య‌జ‌మాని కుమారుడిపైనే వారు అనుమానం వ్య‌క్తం చేయ‌డంతో పోలీసులు రంగంలోకి దిగారు. విచార‌ణ‌లో ఇంటి యజమాని కుమారుడు అంజనే ఈ పాడు ప‌నికి పాల్ప‌డిన‌ట్లు గుర్తించారు. దంపతులు ఇంట్లో లేని సమయంలో డూప్లికేట్‌ తాళం చెవి ద్వారా ఇంట్లోకి ప్రవేశించి బెడ్‌రూంలో రహస్యంగా సీసీ కెమెరా అమర్చినట్లు గుర్తించారు. అలా సేకరించిన దృశ్యాలను ఇంటర్నెట్‌లో అప్‌లోడ్‌ చేశాడని తేల్చారు. పరారీలో ఉన్న అంజన్‌ కోసం సైబర్‌ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *