కొడుకు కోసం ఆ హీరో ఏం చేశాడంటే..

అత‌డో హీరో… భార్య‌తో విడిపోయాడు. మ‌రొక‌రితో స‌హ‌జీవ‌నం చేస్తున్నాడు. అయినా ఒక్క విష‌యంలో భార్య‌పై కోపం ఉంది. త‌న బిడ్డ‌ను త‌న‌కు కాకుండా చేసింద‌ని భావించాడు. చివ‌ర‌కు అత‌డిని ద‌క్కించుకునేందుకు ప్ర‌య‌త్నించాడు. చివ‌ర‌కు పోలీసుల‌కు దొరికిపోయాడు.
భోజ్‌పురి న‌టుడు మ‌హ్మ‌ద్ షాహిద్‌. ముంతాజ్‌ను వివాహం చేసుకున్నాడు. వాళ్ల‌కు ఒక బాబు. కొంత‌కాలం క్రితం ఇద్ద‌రూ కోర్టు నుంచి విడాకులు తీసుకున్నారు. బాలుడు త‌ల్లితో ఉండాల‌ని కోర్టు తీర్పు ఇచ్చింది. ఆ త‌ర్వాత షాహిద్ మ‌రో యువ‌తితో క‌ల‌సి ఉంటున్నాడు. అయితే భార్య ద‌గ్గ‌ర ఉన్న కుమారిని ఎలాగైనా తెచ్చుకోవాలన్న ఆలోచ‌న‌తో ఓ ప్లాన్ వేశాడు. దానిని అమ‌లు చేశాడు. ఈ ఏడాది జూన్‌లో కొడుకును కిడ్నాప్ చేశాడు. అయితే ఆ విష‌యం ముంతాజ్‌కు తెలియ‌దు. ఎవ‌రో త‌న బిడ్డ‌ను కిడ్నాప్ చేశార‌ని పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. పోలీసుల‌కు మాత్రం ఆమె మాజీ భ‌ర్త‌పైనే అనుమానం క‌లిగింది. అత‌డు బిడ్డ‌తో స‌హా ఢిల్లీకి మ‌కాం మార్చాడ‌ని తెలుసుకొని విస్తృతంగా గాలించారు. చివ‌రికి అత‌డిని ప‌ట్టుకున్నారు. బాలుడిని త‌ల్లికి అప్ప‌గించారు. కొడుకు కావాల‌నే కిడ్నాప్ చేశాన‌ని ఆ న‌టుడు అంగీక‌రించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *