పిల్ల కాదు పిడుగే… సీఎం ఇంటి దగ్గరే భూమా మౌనిక నిప్పులు

భూమా మౌనిక. నంద్యాల ఉప ఎన్నికల సమయంలో హోరాహోరీ జరుగుతున్న పోరులో పోలింగ్ రోజు భూమా దంపతులు లేని లోటును తీర్చిన యువతి. తన వర్గం కార్యకర్తలకు ధైర్యం చెబుతూ స్వయంగా రంగంలోకి దిగి ఆమె చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఆ మౌనిక తరవాత కాలంలో పెద్దగా బయట కనిపించలేదు. భూమా సన్నిహితుడు ఏవి సుబ్బారెడ్డి, భూమా వర్గీయుల మధ్య నెలకొన్న వివాదంలో పంచాయతీ సీఎం ఇంటికి చేరడంతో మౌనిక గురువారం అమరావతిలో ప్రత్యక్షమైనది. ఈ సందర్భంగా సుబ్బారెడ్డిపై నిప్పులు కురిపించింది. ఆళ్లగడ్డ ప్రజలు భూమా కుటుంబం వెంటే ఉన్నారని అన్నారు.

ఏవీ సుబ్బారెడ్డికి ఆళ్లగడ్డ ప్రజలే తగిన విధంగా బుద్ధి చెబుతారని మౌనిక హెచ్చరికలు చేశారు. భూమ కుటుంబంతో సుబ్బారెడ్డికి ఉన్న సంబంధం తెగిపోయిందంటున్నారని, సుబ్బారెడ్డి తన తండ్రి స్నేహితుడిగా రాజకీయాల్లో ఎదగాలనుకుంటే సహకరిస్తామని ఆమె అన్నారు. అంతేగానీ… తన అక్కపై విమర్శలు చేసి ఎదగాలనుకుంటే మాత్రం తగిన విధంగా బుద్ధి చెబుతాం నాగమౌనిక హెచ్చరించారు. తమ కుటుంబ సభ్యులంతా అక్క అఖిలప్రియకు తోడుగా ఉన్నారని ఆమె స్పష్టం చేశారు.


గంగుల, ఇరిగెల కుటుంబాలతో సుబ్బారెడ్డి విభేదాలు లేవంటున్నారని, భూమా కుటుంబాన్ని ఏవీ సుబ్బారెడ్డి చాలా బాధపెట్టారని నాగమౌనిక వ్యాఖ్యానించారు. భూమా అఖిలప్రియ, టీడీపీ సీనియర్‌ నేత ఏవీ సుబ్బారెడ్డిల వ్యక్తిగత కక్షలను టీడీపీ అధినాయకత్వం సీరియస్‌గా తీసుకుంది. పార్టీ పిలుపు మేరకు సైకిల్ యాత్రలో ఉన్న తనపై జరిగిన రాళ్ల దాడి వెనుక అఖిలప్రియ వర్గీయులు ఉన్నారన్న సుబ్బారెడ్డి ఆరోపణలపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఎంత నచ్చజెప్పినా ఇద్దరూ వినడం లేదని ఆగ్రహించిన బాబు ఇవాళ మరోసారి వాళ్లతో సమావేశం అయ్యారు.

ఆ సందర్భంగా ఇరువురు నేతలు చంద్రబాబు తలంటారు. సఖ్యత లేకుండా పరస్పరం గొడవలు పెట్టుకుంటూ పంచాయతీలు తీర్చమంటే తనవల్లకాదాని హితవు పలికారు. రాష్ట్రం లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పార్టీ నేతలంతా ఐక్యంగా పని చేయాలని సూచించారు. ఇరువర్గాలను తీవ్రంగా హెచ్చరించిన సీఎం శుక్రవారం మరోసారి తనను కలవాలని వారికి చెప్పి పంపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *