కాకినాడ ఓటమికి టీడీపీ కారణం… చంద్రబాబు కూడా…

అడలేక మద్దెల ఓడు అన్నట్లే ఉంది ఏపీలోని బీజేపీ నేతల తీరు. కాకినాడలో చావు తప్పి కన్ను లొట్ట పడ్డా బీజేపీ నేతలు మాత్రం ఇంకా నేలకు దిగి రావడం లేదు. కాకినాడలో తమ ఓటమికి మిత్రపక్షం టీడీపీనే కారణమని తేల్చేశారు కమలనాథులు. ఒకరిద్దరు అయితే ఇదంతా సీఎం చంద్రబాబుకు తెలిసే జరిగిందని సూత్రీకరించారు.

ఒంగోలులో బీజేపీ రాష్ట్ర నేతల సమావేశం జరిగింది. అందులో ఆ పార్టీ నేతలు… ఇటీవలి కాకినాడ ఎన్నికల్లో ఓటమికి కారణాలు ఏమిటో సమీక్షించారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు సైతం ఓడిపోవడానికి కారణం టీడీపీ చేసిన నమ్మక ద్రోహమేనని తేల్చారు. సమావేశంలో మాట్లాడిన నేతలంతా టీడీపీ మిత్ర ధర్మం పాటించలేదని… కొన్ని సీట్లు తమకు కేటాయించి మళ్లి వాటిలి రెబల్ అభ్యర్థులు బరిలోకి దిగారని చెప్పారు. అలా బీజేపీ ఓడిపోయిన వాటిలి ముడుచోట్ల టీడీపీ రెబల్ అభ్యర్థులే గెలిచారని బీజేపీని టీడీపీ ఓడించినదనడానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుందని ప్రశ్నించారు.

నేతల మాటలు విన్న కేంద్ర పరిశీలకుడు… ఇదంతా టీడీపీ అధినేత సీఎం చంద్రబాబుకు తెలుసా అని ప్రశ్నించారు. దానికి కొందరు మాత్రం సీఎంకి తెలియకపోవచ్చనగా…. ఒకరిద్దరు మాత్రం ఇదంతా సీఎంకి తెలిసే జరిగిందన్నారు. అయితే దేశమంతా మోడీ గాలి వేస్తుంటే… ఈవిఎంలో కమలం కనిపిస్తే ఓట్ల వర్షం కురుస్తుంటే ఏపీలో మాత్రం కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ సహకరించక ఒడిపోయాం అని మాట్లాడడం ఏమిటో కాషాయ నేతలకే తెలియాలి. అంటే ఏపీలో మోడీ గాలి లేనట్లేనా… చంద్రబాబు ఓట్లు వేయించకుంటే ఇక్కడ బీజేపీ గెలవలేదని వారే అంగీకరించినట్లేనా…?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *