టీడీపీతోనే మా పయనం… బీజేపీ కీలక ప్రకటన

నంద్యాల ఉప ఎన్నిక‌ల‌పై బీజేపీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఉప ఎన్నిక‌ల్లో టీడీపీకే జై కొట్టాల‌ని నిర్ణ‌యించింది. విజ‌య‌వాడ‌లోని పార్టీ కార్యాల‌యంలో శ‌నివారం నిర్వ‌హించిన ప‌దాధికారుల స‌మావేశంలో ఈ నిర్ణ‌యం తీసుకుంది. నంద్యాల ఎన్నిక‌ల‌తోపాటు త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న కాకినాడ మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లోనూ సైకిల్‌తోనే స‌వారీ చేస్తామ‌ని ప్ర‌క‌టించింది.
టీడీపీ,బీజేపీలు గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో క‌ల‌సి పోటీ చేశాయి. కేంద్రంలో టీడీపీ, రాష్ర్టంలో బీజేపీ మంత్రి ప‌ద‌వులూ పొందాయి. అయితే నంద్యాల ఉప ఎన్నిక‌ల విష‌యంలో బీజేపీ ఆల‌స్యంగా నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించింది. ఒక‌టి రెండు రోజులో్ల బీజేపీ నాయ‌కులూ టీడీపీతో క‌ల‌సి ప్ర‌చారంలో పాల్గొంటార‌ని బీజేపీ నేత‌లు తెలిపారు. ఈ నెల 23న నంద్యాల ఉప ఎన్నిక‌ల పోలింగ్ జ‌ర‌గ‌నుంది. మాసాంతంలో మూడురోజుల ప‌ర్య‌ట‌న‌కు బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్‌షా ఏపీకి వ‌స్తున్నారు. దానికి సంబందించిన ఏర్పాట్ల‌పైనా ప‌దాదికారుల స‌మావేశంలో చ‌ర్చించారు. కొన్ని నిర్ణ‌యాలు తీసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *