కంభ‌పాటికి బీజేపీ మ‌రో షాక్ ఇవ్వ‌బోతుందా..!

ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు, విశాఖ‌ప‌ట్నం ఎంపీ కంభ‌పాటి హ‌రిబాబుకు మ‌రోషాక్ ఇచ్చేందుకు బీజేపీ అధిష్ఠానం సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు తెలుస్తోంది. ఇందుకోసం రంగం సిద్ధ‌మైన‌ట్లు స‌మాచారం. ఇటీవ‌ల జ‌రిగిన కేంద్ర కేబినెట్ పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌లో హ‌రిబాబుకు మంత్రి ప‌ద‌వి ఖాయ‌మ‌ని అంద‌రూ భావించారు. ప్ర‌ధాని కార్యాల‌యం నుంచి కూడా ఫోన్ వ‌చ్చింది. ఆయ‌న ముందురోజు రాత్రి హుటాహుటిన కుటుంబ‌స‌భ్యుల‌తో విమానంలో ఢిల్లీ వెళ్లిపోయారు. మ‌రుస‌టి రోజు ఉద‌యం అందే తీపి క‌బురు కోసం ఆస‌క్తిగా ఎదురు చూశారు. కానీ ఆయ‌న‌కు పిలుపు రాలేదు. కేబినెట్‌లో స్థానం క‌ల్పించ‌లేదు. దాంతో ఆయ‌నకు నిరాశే మిగిలింది. దానికి మించిన షాక్ ఇచ్చేందుకు ఇప్పుడు బీజేపీ అధిష్ఠానం రెడీ అయ్యిన‌ట్లు స‌మాచారం.

ఏపీలో బీజేపీ విస్త‌ర‌ణ‌కు బాగా అవ‌కాశాలు ఉన్నాయ‌ని ఆ పార్టీ అధిష్ఠానం భావిస్తోంది. అంతేకాదు ఏపీలో పార్ల‌మెంటు, అసెంబ్లీ సీట్లు పెంచుకోవాల‌న్న ల‌క్ష్యంతో ముందుకు సాగుతోంది. అయితే ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితులు రాష్ర్టంలో పార్టీ ఎదుగుద‌ల‌కు అనుకూలంగా లేవ‌ని భావిస్తోంది. అందుకు పార్టీ రాష్ర్ట అధ్య‌క్షుడు హ‌రిబాబే కార‌ణ‌మ‌న్న బ‌ల‌మైన నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లుతెలుస్తోంది. ఆయ‌న పార్టీ విస్త‌ర‌ణ‌కు వేగంగా పావులు క‌ద‌ప‌లేక‌పోతున్నార‌న్న‌ది ఆ పార్టీ యోచ‌న‌గా ఉంది. కేంద్రంలోని బీజేపీ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ల‌డంలోనూ స‌ఫ‌లం కాలేక‌పోయార‌న్ననిర్ణ‌యానికి వ‌చ్చింది. అందుకే మ‌రో ఒక‌టిన్న‌ర సంవ‌త్స‌రాల్లో ఎన్నిక‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో కీల‌క మార్పులు చేయాల‌ని భావిస్తోంది. అందులో భాగంగా తొలుత పార్టీ రాష్ర్ట అధ్య‌క్షుడు హ‌రిబాబు ప‌ద‌వికి ఎస‌రు పెట్టేందుకు సిద్ధ‌మైంది.

కొత్త వ్య‌క్తికి అధ్య‌క్ష‌ప‌ద‌వి కేటాయించేందుకు సిద్ధ‌మైంది. రాష్ర్టంలో కీల‌క సామాజిక‌వ‌ర్గాల్లో ఒక‌టిగా ఉన్న కాపుల‌కు ప‌ద‌వి ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది. ఇద్ద‌రి పేర్ల‌ను ఫైన‌ల్ చేసింది. క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌, ఎమ్మెల్సీ సోము వీర్రాజుల్లో ఒక‌రిని అధ్య‌క్ష ప‌ద‌వి వ‌రించ‌నుంది. దీనికి సంబంధించిన ప్ర‌క‌ట‌న త్వ‌ర‌లో వెలువేడే అవ‌కాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *