టీడీపీకి  షాక్‌ ఇవ్వ‌నున్న‌బోడ‌

ఎన్నిక‌లు ముంచుకొస్తున్న వేళ అన్ని పార్టీలకూ ఒక్క‌టే టెన్ష‌న్. అదే జంప్‌జిలానీలు. ఈసారి సాధార‌ణ ఎన్నిక‌లు మ‌రో రెండు సంవ‌త్స‌రాలు ఉండ‌గానే నేత‌ల జంపింగ్ క‌హానీ మొద‌లైంది. సీటు, గెలుపే ల‌క్ష్యంగా నాయ‌కులు అప్ప‌టివ‌ర‌కూ వ‌ల్లించిన పార్టీ సిద్ధాంతాల‌ను ప‌క్క‌న‌బెట్టేస్తున్నారు. త‌మ రాజ‌కీయ భ‌విష్య‌త్తే ముఖ్యంగా భావిస్తున్నారు. పార్టీలు మారేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్ప‌టికే ఎమ్మెల్యేల జంప్‌తో డీలా ప‌డిన టీ టీడీపీకి మ‌రో నేత షాక్ ఇవ్వ‌డానికి సిద్ధ‌మైపోయిన‌ట్లు తెలుస్తోంది. అయితే గ‌తంలో మంత్రిగా కూడా ప‌ని చేసిన ఆయ‌న మిగిలిన వాళ్ల‌కు భిన్నంగా వెళుతున్నారు. తెలంగాణ‌లో టీడీపీ, కాంగ్రెస్‌ల నుంచి టీఆర్ ఎస్‌ల‌కు జంప్ చేస్తుంటే ఆయ‌న మాత్రం కొత్త రూటు ఎంచుకున్నారు. కాంగ్రెస్‌లోకి వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్నారు.
బోడ జ‌నార్ద‌న్ గ‌తంలో ఆదిలాబాద్ జిల్లా నుంచి మంత్రిగా ప‌ని చేశారు. ప్ర‌స్తుతం టీడీపీ మంచిర్యాల జిల్లా అధ్య‌క్షుడిగా ఉన్నారు. తెలంగాణ‌లో టీడీపికి భ‌విష్య‌త్తు క‌నిపిచండంలేద‌ని భావించిన ఆయ‌న పార్టీ మారేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఆయ‌న కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. చెన్నూరు సీటు లక్ష్యంగా ఆయ‌న పావులు క‌దుపుతున్నారు. కాంగ్రెస్ కూడా ఆయ‌న‌కు ఆ సీటు ఇచ్చేందుకు అంగీక‌రించిన‌ట్లు తెలుస్తోంది. దాంతో ఆయ‌న త్వ‌ర‌లో హ‌స్తం టీమ్‌లో చేరిపోనున్నారు. జ‌నార్ద‌న్ గ‌తంలో ఒక‌సారి టీఆర్ఎస్‌లో చేరారు. అక్క‌డి నుంచి వైసీపీకి మారారు. ఆ త‌ర్వాత సొంతింటి(టీడీపీ)కి వ‌చ్చేశారు. చెన్నూరులో గెలుపే ల‌క్ష్యంగా ఇప్ప‌డు కాంగ్రెస్‌లో చేరుతున్న‌ట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *