జ‌మైకా చిరుత‌వేగం త‌గ్గింది…

ప‌రుగు పందెం అన‌గానే ప్ర‌పంచ వ్యాప్తంగా గుర్తుకొచ్చేపేరు బోల్ట్. కొన్నేళ్లుగా ప‌రుగు పందెంలో రారాజుగా వెలుగొందుతున్న ఈ జ‌మైకా చిరుత వేగం త‌గ్గింది. త‌న కెరీర్‌లోని ఆఖ‌రి ప‌రుగులో బంగారు ప‌త‌కానికి దూర‌మ‌య్యాడు. లండ‌న్‌వేదిక‌గా జ‌రుగుతున్న ఐఏఏఎఫ్ ప్ర‌పంచ అథ్లెటిక్స్ ఛాంపియ‌న్‌షిప్‌లో బోల్ట్ కాంస్యం గెలుచుకున్నాడు. శ‌నివారం అర్ధ‌రాత్రి జ‌రిగిన వంద‌మీట‌ర్ల రేసులో మూడోస్థానానికి ప‌రిమిత‌మ‌య్యాడు.
ఈ ప‌రుగులో అమెరికా స్టార్ స్ప్రింట‌ర్ జ‌స్టిస్ గాట్లిన్ స్వ‌ర్ణం గెలుచుకున్నాడు 8 సార్లు ఒలింపిక్ చాంపియ‌న్‌గా నిలిచిన బోల్డ్ ను ఓడించాడు. మ‌రో అమెరిక‌న్ స్ప్రింట‌ర్ క్రిష్టియ‌న్ కోలెమ‌న్ ర‌జిత ప‌త‌కం కైవ‌సం చేసుకున్నారు. ఈరేసును గాట్లిన్ 9.92, కోలెమ‌న్ 9.94, బోల్ట్ 9.95 సెక‌న్ల‌లో కంప్లీట్ చేశారు. అయితే చివ‌రి మ్యాచ్‌లోనూ అద్భుత ప్ర‌తిభ‌తో అల‌రిస్తాడ‌ని ఆశించిన అభిమానుల‌కు బోల్డ్ నిరాశ‌ను మిగిల్చాడు. అయినా అభిమానుల‌కు ఆటోగ్రాఫ్‌లు ఇచ్చి, వాళ్ల‌తో సెల్ఫీలు దిగి ఉత్సాహం నింపాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *