ఫేస్‌బుక్ పోస్టు అత‌ని కొంప ముంచింది…

మీరు ఫేస్‌బుక్‌లో ఇష్టారీతిగా పోస్టింగులు చేస్తున్నారా… అయితే కాస్త జాగ్ర‌త్త‌గా ఉండండి. ఒక్కోసారి మీరు పెట్టే పోస్టింగులు మీ కొంప ముంచుతాయి. మీరు ఊహించ‌ని న‌ష్టాన్ని తెచ్చిపెడ‌తాయి. చివ‌ర‌కు క‌ట‌క‌టాల వెన‌క్కు పంపుతాయి. అందుకు నిద‌ర్శ‌న‌మే ఈ యూపీ యువ‌కుడి వ్య‌వ‌హారం… ఇంత‌కీ ఏమిటా విష‌యం…

ఉత్త‌ర ప్ర‌దేశ్‌కు చెందిన జ‌కీర్ అలీ త్యాగీ ఫేస్‌బుక్‌ల్లో పోస్టులు చేస్తుంటాడు. అలాగే గంగాన‌ది, రాంమందిర్ నిర్మాణం, ముస్లింల‌కు హ‌జ్ స‌బ్సిడీపై ఫేస్‌బుక్‌లో కొన్నిపోస్టింగులు పెట్టాడు. అత‌డు అనుచిత వ్యాఖ్య‌లు చేశాడంటూ పోలీసులు అరెస్టు చేశారు. అత‌నిపై ఐటీ చ‌ట్టంతోపాటు సెక్ష‌న్ 420 కేసు న‌మోదు చేశారు. కోర్టు అత‌నికి 42 రోజులు జైలుశిక్ష విధించింది. ముజ‌ఫ‌ర్‌న‌గ‌ర్ జైలులో తీవ్ర‌నేరాలు చేసిన ఖైదీల‌తోపాటు ఉంచారు. శిక్ష అనుభ‌వించిన జ‌కీర్ విడుద‌ల‌య్యాడు. అయితే ఇప్ప‌డది చ‌ర్చ‌నీయాంశ‌మైంది. సోష‌ల్‌మీడియాలో పోస్టులు పెట్టినందుకే నేరంగా ప‌రిగ‌ణించ‌డంపై ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. క‌రుడుగ‌ట్టిన నేర‌గాళ్ల‌తో ఉంచ‌డమూ వివాద‌మ‌వుతోంది. జ‌కీరే కాదు గ‌తంలోనూ ఇలా సామాజిక మాద్య‌మాల్లో అభ్యంత‌ర‌క‌ర పోస్టింగులు పెట్టినందుకు కేసులు పెట్టి అరెస్టు చేసిన ఘ‌ట‌న‌లు ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *