చదువుల తల్లిపై గ్యాంగ్ రేప్.. టాపర్ పై పాశవికంగా…

చదువుల తల్లి మీద కామ పిశాచాలు రాబందుల్లా వాలయి. సీబీఎస్ఈ లో టాపర్ గా నిలిచి రాష్ట్రపతి నుంచి సన్మానం చేయించుకున్న విద్యార్థిని జీవితాన్ని ఈ రాబందులు చిదిమేసాయి.
నిర్భయ లాంటి కఠిన చట్టాలు ఉన్నా ఇలాటి అఘాయిత్యాలకు కళ్లెం పడడం లేదు. తాజాగా హరియాణాలో మరో ఘోరం చోటుచేసుకుంది. సీబీఎస్ఈ బోర్డు పరీక్షలో టాప్ ర్యాంక్ సాధించి, రాష్ట్రపతి చేత సన్మానం పొందిన విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కొందరు వ్యక్తులు 19 ఏళ్ల యువతిని కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి చేశారు.

మహేంద్రగఢ్ జిల్లాలో జరిగిన ఈ ఉదంతం దేశాన్ని దిగ్బ్రాంతికి గురి చేసింది. ఆ విద్యార్థిని కోచింగ్‌కు వెళుతున్న సమయంలో ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేసి, పొలాల్లోకి ఈడ్చుకువెళ్లి అత్యాచారం చేసినట్లు బాధితురాలు తెలిపింది. ఆ సమయంలో అక్కడే పొలాల్లో ఉన్న మరికొంతమంది సైతం ఆమెపై దారుణానికి ఒడిగట్టారని రోదించింది. అనంతరం అపస్మారక స్థితిలో ఉన్న ఆ యువతిని సమీపంలో ఉన్న బస్టాండ్ వద్ద వదిలేసి వెళ్లిపోయారు ఆగంతకులు.

జరిగిన దారుణంపై బాధిత విద్యార్థిని తల్లిదండ్రులుకు చెప్పగా వారు పోలీసులను ఆశ్రయించారు. అక్కడా వారికి నిరాదరణ ఎదురైంది. జరిగిన దారుణంపై ఎఫ్ఐర్ నమోదు చేయడానికి పోలీసులు అంగీకరించలేదు. ఈ విషయాన్ని చెప్పి బాధితులు కన్నీరుమున్నీరైంది. అయితే బాధితుల పిర్యాదు మేరకు జీరో ఎఫ్ఐర్ నమోదు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. జరిగిన సంఘటన ఏ పీఎస్ పరిధిలోకి వస్తుందో… అక్కడికే కేసు బదిలీ చేస్తామని పోలీసులు వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *