పెళ్లి వ‌య‌సు లేకున్నా పోలీసులే దండ‌లు మార్పించారు

వాళ్లిద్ద‌రికీ చ‌ట్ట ప్ర‌కారం పెళ్లి వ‌య‌సు రాలేదు. మామూలుగా అయితే వాటిని పెద్ద‌గా ప‌ట్టించుకోరు. కానీ పోలీసులే చ‌ట్టాన్ని ఉల్లంఘించారు. ఓ ప్రేమ జంట‌కు పోలీస్‌స్టేష‌న్‌లోనే పెళ్లి చేయించారు. రాజ‌ధానిలోని సైబ‌రాబాద్ క‌మిష‌న‌రేట‌ర్ ప‌రిధిలో జ‌రిగింది. రంగారెడ్డి జిల్లా నందిగామ‌కు చెందిన అబ్బాయి , అమ్మాయి ప్రేమించుకున్నారు. అబ్బాయి వ‌య‌సు 20, అమ్మాయి వ‌య‌సు 19. ఇద్ద‌రూ పెళ్లి చేసుకోవాల‌ని అనుకున్నారు. మ‌తాలు వేరుకావ‌డంతో పెద్ద‌లు ఒప్పుకోర‌ని భ‌య‌ప‌డ్డారు. 15 రోజుల క్రితం ఇద్ద‌రూ ఎక్క‌డికో వెళ్లిపోయారు. ఇద్ద‌రి బంధువులు నందిగామ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. పోలీసులూ కేసు న‌మోదు చేశారు. ఆ యువ జంట ఈ నెల 25న పోలీస్ స్టేష‌న్‌కు వ‌చ్చింది. కుటుంబ స‌భ్యుల‌తో వెళ్లేందుకు అమ్మాయి స‌సేమిరా అంది. అబ్బాయి త‌ల్లిదండ్రులు వాళ్ల‌కు పెళ్లి చేయాల‌ని పోలీసుల‌ను కోరారు. కేసు న‌మోదు చేసిన‌ప్పుడు అబ్బాయి వ‌య‌సు 20 అని న‌మోదు చేశారు. చ‌ట్ట ప్ర‌కారం అబ్బాయికి 21, అమ్మాయికి 18 ఏళ్లు లేకుండా పెళ్లి చేయ‌కూడ‌దు. పోలీసులు ఇదేమీ ప‌ట్టించుకోలేదు. వాళ్లిద్ద‌రికీ దండ‌లు మార్పించి పెళ్లి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *