పాక్ గెలుపుతో ఆయ‌న‌కు ఈద్ ముందే వ‌చ్చేసింద‌ట‌

చాంపియ‌న్స్ ట్రోఫీ ఫైన‌ల్‌లో దాయాదులు త‌ల‌ప‌డ్డారు. అభిమానుల్లో అంత్యంత ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో పాక్ భార‌త్‌పై విజ‌యం సాధించింది. దేశంలోని అభిమానులంతా తీవ్ర నిరుత్సాహంతో ఉన్నారు. మ‌న ఆట‌గాళ్ల ఆట‌తీరుపై అసంతృప్తిగా ఉన్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న పాక్‌ను పొగుడుతూ చేసిన ట్వీట్ పుండుమీద కారం చ‌ల్లిన‌ట్టుగా ఉంది.
చాంపియ‌న్స్ ట్రోఫీలో ఫైన‌ల్ మ్యాచ్‌లో భార‌త్‌పై పాకిస్తాన్ విజ‌యంపై క‌శ్మీర్ వేర్పాటు వాద నేత మిర్వాయిజ్ ఉమ‌ర్ ఫారూఖ్ ఒక ట్విట్ చేశారు. అత్య‌త్త‌మ .జ‌ట్టు విజ‌యం సాధించిందంటూ పాకిస్తాన్ జ‌ట్టుకు శుభాకాంక్షలు తెలిపాడు. అంతేకాదు న‌లుదిక్కులా బాణ‌సంచా పేలుతోంద‌నీ, ఈద్ ముందుగా వ‌చ్చిన‌ట్లుంద‌ని ట్వీట్‌లో పేర్కొన్నాడు. ఆయ‌న చేసిన ట్వీట్‌పై ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతోంది. ఆయ‌న ట్వీట్‌కు వ్య‌తిరేకంగా ట్వీట్ల వ‌ర్షం ప్రారంభ‌మైంది. క్రికెట‌ర్ గౌతం గంభీర్ ఘాటుగా స్పందించారు. మిరాజ్‌కు ఆయ‌న ఒక స‌ల‌హా ఇచ్చారు. పాకిస్తాన్ వెళ్లి ఈద్ చేసుకోవాల‌నీ, సామాన్లు స‌ర్దేందుకు సాయం చేస్తాన‌ని గ‌ట్టిగా స‌మాదానం ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *