బాబు మరో ఘనత… గ్లోబల్ అవార్డుకు ఎంపిక

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మరో ఘనత సాధించారు. ప్రతిష్ఠాత్మకమైన 11వ గ్లోబ ల్‌ అగ్రికల్చరల్‌ లీడర్‌షిప్‌ అవార్డు-2018కి ఆయన ఎంపికయ్యారు. ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ ఎంఎస్‌ స్వామినాథన్‌ అధ్యక్షతన నియమించిన జ్యూరీ కమిటీ ఈ అవార్డుకు బాబును ఎంపిక చేసింది. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ సంస్థ ఈ మేరకు సీఎంకి ఈ-మెయిల్‌ ద్వారా సమాచారం ఇచ్చింది. గ్రామీణ ప్రాం తాల్లో రైతుల సంక్షేమం కోసం, సాధికారత కోసం కృషి చేసిన సంస్థలు, వ్యక్తులకు ఈ సంస్థ ఏటా పురస్కారాలు అందించి గౌరవిస్తారు.

ప్రతి సంవత్సరం విధానం, పరిశ్రమ, పరిశోధన, సాగు, అభివృద్ధి నాయకత్వం, ఉత్తమ వ్యవసాయ రాష్ట్రం, జీవనకాల సాఫల్యం తదితర 15 రకాల కేటగిరీల్లో ఈ అవార్డులను ప్రదానం చేస్తారు . జాతీయ అవార్డు కమిటీ ఢిల్లీలో గత నెల 15 న సమావేశమై చంద్రబాబును పాలసీ లీడర్‌షిప్‌ అవార్డుకు ఎంపిక చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయరంగంలో ప్రగతి సాధించి.. పల్లెల సౌభాగ్యానికి కృషి చేస్తూ.. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి కోసం విజన్‌తో నాయకత్వం వహించినందుకు ఈ అవార్డు ఇవ్వనున్న ట్లు ఐసీఎ్‌ఫఏ సీఎంకు పంపిన మెయిల్‌లో వివరించింది.

2015లో ఈ అవార్డుకు అప్పటి ఉత్తరప్రదేశ్‌ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌, 2016లో మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, 2017లో హరియాణా సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ లు అందుకున్నారు. 2018లో చంద్రబాబు అందుకోనున్నారు. ఈ నెల 24వ తేదీ సాయం త్రం ఢిల్లీలోని హోటల్‌ హయత్‌ రీజెన్సీలో నిర్వహిం చే కార్యక్రమంలో ఆయనకు ఈ పురస్కారం అందజేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *