చంద్రబాబు, లోకేష్ పాస్పోర్టుల స్వాధీనం…!?౧

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన తనయుడు మంత్రి లోకేష్ లపై వైసిపి ముఖ్య నేత విజయసాయిరెడ్డి సంచలన వ్యళ్హయలు చేశారు. కొన్నాళ్ల క్రితం ఢిల్లీలో చంద్రబాబు పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన వైసిపి రాజ్యసభ సభ్యుడు మరోసారి తన నోటికి పని చెప్పారు. సీఎం చంద్రబాబు ఓ దొంగ అని, ఈ నాలుగేళ్లలో రూ.4.5 లక్షల కోట్ల ప్ర జాధనం దోచుకున్నారని విజయసాయిరెడ్డి అన్నారు.

విశాఖ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో జగన్‌ ప్రజాసంకల్ప యాత్ర పూర్తయిన సందర్భంగా సోమవారం విశాఖ ఫంక్షన్‌ హాలులో ఆత్మీయ సభ జరిపారు. దీనికి ముఖ్యఅతిథిగా విజయసాయి మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతే.. విజయ్‌మాల్యా పారిపోయినట్లు చంద్రబాబు తన కుమారుడు లోకేశ్‌ను తీసుకుని విదేశాలకు పారిపోయే అవకాశం ఉందన్నారు. ముందు జాగ్రత్తగా కేంద్రం.. తండ్రీకొడుకుల పాస్‌పోర్టులు స్వాధీనం చేసుకోవాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *