ఆ నీచులు నా చెస్ట్ తాకి అసభ్యంగా…

లైంగిక వేధింపులకు వయసు… స్థాయి… వ్యక్తులతో పని లేదు. చిన్న అవాళ్ళ నుంచి పెద్ద వాళ్ల వరకు అందరూ మృగాళ్ల బారిన పడుతున్నవారే. తాజాగా సింగర్ చిన్మయి తాను ఎదుర్కొన్న దారుణ పరిస్థితుల్ని వివరించి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, సింగర్ గా విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న చిన్మయి తను చిన్నతనంలో ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి బహిరంగంగా చెప్పడం సంచలనం కలిగిస్తోంది.

లైంగిక వేధింపులకు వయసుతో సంబందం లేదని చిన్మయి ఉదంతం నిరూపిస్తోంది. తనకు ఎనిమిదేళ్ల వయసులో తల్లితో కలిసి డాక్యుమెంటరీ రికార్డ్ కోసం వెళ్లానని అక్కడ వేధింపులు ఎదుర్కొన్నానని వెల్లదించారు. తన తల్లి పనిలో ఉండడంతో అక్కడే నిద్రపోయిన చిన్మయి…. ఎవరో తన ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేస్తున్నట్లు అనిపించడంతో లేచి చూస్తే పక్కన ఓ పెద్ద మనిషి ఉన్నాడని దాంతో తాను దిగ్బ్రాంతికి గురయ్యానని వెల్లడించింది.

 

ఇక తాను ఎదుర్కొన్న మరో సంఘటన మనుషుల తీరుపైనే అసహ్యం కలిగేలా చేసిందని ఆమె పేర్కొన్నారు. ‘ఓసారి యాక్సిడెంట్ జరిగి కింద పడిపోయి కదల్లేని స్థితిలో ఉండగా.. నా దగ్గరకి వచ్చిన కొందరు మగాళ్లు షర్ట్ జేబుల్లో ఏముందో చూసే వంకతో నా  చెస్ట్ టచ్ చేసే ప్రయత్నం చేశారు. ఎంత నీచమైన ప్రవర్తన’ అంటూ ఆవేదన వెలిబుచ్చింది. ఇక ఆన్ లైన్ లో కూడా తనను బెదిరిస్తున్నారని, ఆడవాళ్లే ఆడవాళ్లకు సపోర్ట్ చేయని పరిస్థితి వచ్చిందంటూ వ్యాఖ్యానించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *