పితాని… పీకే… దేవినేని అందరికి బాబు స్ట్రాంగ్ వార్నింగ్..!


మంగళవారం జరిగిన టీడీపీ సమన్వయకమిటి సమావేశం హాట్ హాట్ గా జరిగింది. పలువురు నేతల తీరుపై సీఎం చంద్రబాబు చండ్ర నిప్పులు కురిపించారు. వరుసగా మంత్రులు… పార్టీ సీనియర్ నేతలకు దాదాపుగా వార్నింగ్ ఇచ్చినంత పని చేసారు.

ముఖ్యంగా ఇటీవల మంత్రి పితాని సత్యనారాయణ… జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద చేసిన వ్యాఖ్యల విషయం చర్చకు వచ్చింది. మిత్రపక్షంగా ఉన్న పార్టీ గురించి మాట్లాడవలసిన పద్ధతి ఇదేనా అని సీఎం తీవ్ర అసహనం ప్రదర్శించినట్లు సమాచారం. ఎవరు కూడా వారి ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించినట్లు తెలిసింది.

ఇక తర్వాత చర్చ పరిటాల ఇంట్లో పెళ్లిలో తెలంగాణ సీఎం చేసిన హడావుడి మీదకు మళ్లింది. పయ్యావుల కేశవ్ ని కేసీఆర్ పక్కకు మాట్లాడిన తీరు దాని మీద జరిగిన చర్చపై చంద్రబాబు అసహనం ప్రదర్శించారు. ఇలాంటి సందర్భాల్లో తెలంగాణలో మనకూ పార్టీ ఉందన్న విషయం మర్చిపోవద్దని హితవు పలికారు.

ఆ వెంటనే విజయవాడలో పార్టీ రాష్ట్ర కార్యాలయం ఏర్పాటు పైన బాబు అసంతృప్తి వ్యాక్తం చేసారని తెలిసింది. ఈ విషయంలో మంత్రి దేవినేని నెహ్రూ చురుకుగా వ్యవహరించలేదని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. వెంటనే పనులు ప్రారంభించాలని… తాను విదేశాలనుంచి రాగానే శంకుస్థాపన పెట్టుకుందామని చంద్రబాబు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *