ఆ హీరోతో ఈ హీరోయిన్ అలా అలా అలా…

గ్లామర్ ఫీల్డ్ లో ఉన్న వారిపై రోజుకో వార్త, రూమర్స్ పుట్టుకొస్తూనే ఉంటాయి. ఒక దానికి వారు సమాధానం ఇచ్చే లోపే మరో పుకారు షికారు చేస్తుంది. ముఖ్యంగా హీరోయిన్స్ గురించి అయితే చెప్పనవసరం లేదు. ఏ హీరోతో రెండోసారి కలిసి నటించినా, ఎవరితో సన్నిహితంగా ఉన్నా వారిద్దరికీ అఫైర్ అంటూ వార్తలు పుట్టుకొస్తాయి. తాజాగా నటి స్వాతికి కూడా అలాంటి అనుభవమే ఎదురైందట.

అయితే తన గురించి ఇప్పటి వరకు చాలా గాసిప్స్ వచ్చాయి కానీ, ఓ హీరోతో అఫైర్ ఉంద‌ని రాయ‌డమే చాలా బాధ‌క‌లిగించింద‌ని స్వాతి తన ఆవేదన వ్యక్తం చేసింది. ఇంతకీ ఎవరా హీరో అంటే అల్ల‌రి న‌రేష్ అట. నరేష్ తనకు చాలా మంచి స్నేహితుడని, అయితే అలాంటి వ్యక్తితో తనకు అఫైర్ ఉందని వచ్చిన వార్తలు చూసి షాక్ అయ్యిందట స్వాతి.

గతంలో నిఖిల్ తో, మరో సంగీత దర్శకుడితో కూడా స్వాతి అఫైర్ నడుపుతోందంటూ వార్తలు వచ్చాయి. ఆ సమయంలో కూడా స్వాతి చాలా ఇబ్బంది పడిందట. ఎవరితో పని చేస్తే వాళ్లతో తన పేరును లింక్ చేయడం రాయడం వల్ల అటువైపు వారు, తాను చాలా బాధపడుతున్నామని అంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *