కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని తేల్చేసిన హరీష్

తెలంగాణలో ముందస్తు ఎన్నికల రణం హోరాహోరీగా మారింది. అధికార ప్రతిపక్షాలు ఒకరిపై మరొకరు చేసుకుంటున్న విమర్శల వాడి పెరిగింది. మహాకూటమి ఏర్పాటు… టీడీపీతో పొత్తుపై కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి టిఆర్ఎస్ నేత హరీష్ రావు 12 ప్రశ్నలు సంధించారు. వాటికి బదులుగా స్పందించిన ఉత్తమ్ నేరుగా కేసీఆర్ కి ప్రత్యుత్తరం ఇచ్చారు. అందులో మంత్రి హరీష్ రావు సంధించిన 12 ప్రశ్నల లేఖకు ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.

ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని మంత్రి హరీష్ రావు తనకు రాసిన లేఖలో తేల్చేశారని ఉత్తమ్ పేర్కొన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ ఓటమిని హరీష్ రావు ముందుగా అంగీకరించినందుకు ఉత్తమ్ ధన్యవాదాలు చెప్పారు. టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఫామ్ హౌజ్ కు పరిమితమయ్యే సమయం వచ్చేసిందని ఉత్తమ్ జోస్యం చెప్పారు.

రాబోయే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ రాబోతుందని ఉత్తమ్ అన్నారు. రాష్ట్ర సంపదను దోచుకుని మూఢ నమ్మకాలతో పాలించారని ఉత్తమ్ ధ్వజమెత్తారు. ఎన్నికలంటే భయపడుతున్న కేసీఆర్ కు మహాకూటమి పొత్తులపై ఆందోళన కలుగుతోందని ఎద్దేవా చేశారు.

ఇక హరీష్ లేఖపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ స్పందించారు. మహాకూటమిని విమర్శించే ముందు ఎన్నికల హామీలను విస్మరించిన మీమామను నిలదియ్యాలని సూచించారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసిన మహాకూటమి విజయాన్ని ఆపలేరని తేల్చి చెప్పారు సీట్ల సర్దుబాటు అంశం సామరస్యంగా చేసుకుంటామని రమణ వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *